Bankers and govt silent on loan waiver

telanana finance minsiter eetela rajender, farmers loan waiver delaying, bankers and govt silent on loan waiver

bankers and govt silent on loan waiver

మంత్రులమైపోయాం ఏం చేస్తాం మరి?

Posted: 07/01/2014 03:28 PM IST
Bankers and govt silent on loan waiver

రైతుల ఋణమాఫీల మీద జరుగుతున్న జాప్యంలో తెలంగాణా ఆర్థిక శాఖామాత్యులు ఈటెల రాజేందర్ ని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులు ఆయన దగ్గర్నుంచి ఎటువంటి సమాధానాన్ని రాబట్టలేకపోయారు.  

అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వాగ్ధాటితో విమర్శలను గుప్పించిన రాజేందర్ ఇప్పుడు స్థానాలు మారిపోవటం వలన మాట్లాడలేని అశక్తతను ప్రదర్శించారు.  మంత్రులమయ్యాం కదా మా నోళ్ళు మూతబడ్డాయన్న సంకేతాన్నిచ్చారాయన.  

మరి బ్యాంకర్లు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారంటే మాత్రం ఆ సంగతి వాళ్ళనే అడగండి అన్నారాయన.  రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోవటంతో ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికారపక్షంలోకి వచ్చిన నాయకులకు నోటితో పెద్దగా పనిలేకుండా పోతోంది.  అప్పడూ పని చేసారు, ఇప్పుడూ చేస్తున్నారు.  అప్పుడూ మెదడుకి పదునుపెట్టి ఆలోచించేవారు, ఇప్పుడూ ఆలోచిస్తున్నారు కానీ లక్ష్యంలో మార్పు వచ్చింది.  ఇప్పడు ఆలోచించేది తెలంగాణాను ఏవిధంగా అభివృద్ధి చెయ్యాలా అని.  అప్పుడు ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు పనిచేసారు, ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించటానికి పనిచేస్తున్నారు.  

కాకపోతే తిట్టే నోరు, కొట్టే చేతులు ఊరికే ఉండవన్న సామెతను గుర్తుచేస్తున్నాయి ఈటెల, ఏం చేస్తాం మంత్రులమయ్యాం కదా అన్న మాటలు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles