Cm kcr orders to take over empty lands to build it companies which are not yet used

Cm kcr orders to take over empty lands to build IT companies which are not yet used, cm kcr press meet, cm kcr comments on lands, cm kcr latest news, cm kcr orders to ministers to take over the lands, cm kcr latest news, cm kcr media press meet, cm kcr cabinet meeting, cm kcr with It officials, cm kcr controversial comments on empty lands

Cm kcr orders to take over empty lands to build IT companies which are not yet used

పనికిరాని భూముల్ని వెనక్కి తీసుకోండి - కేసీఆర్

Posted: 06/21/2014 09:33 AM IST
Cm kcr orders to take over empty lands to build it companies which are not yet used

(Image source from: Cm kcr orders to take over empty lands to build IT companies which are not yet used)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం తన దూకుడును రోజురోజుకు పెంచుకుంటూ వస్తున్నారు. తాజాగా పరిశ్రమల అభివృద్ధి గురించి ప్రసంగించిన కేసీఆర్... అందుకు అవసరమయ్యే భూముల కేటాయింపు విషయంలో ప్రణాళికలను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వున్నప్పుడు అప్పట్లో పరిశ్రమలు స్థాపించాలని కేటాయించిన భూములలో ఇప్పటికీ కొన్ని ప్రారంభించలేదు. మరికొన్ని అర్థాంతరంగా మధ్యలోనే నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్... ‘‘గతంలో పరిశ్రమల స్థాపనకు తీసుకున్న భూముల్లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుంటే వెంటనే వాటిని స్వాధీనం చేసుకోండి’’ అని ఆదేశించినట్టు తెలిపారు. అలాగే ఏ చాలాచోట్ల పరిశ్రమలు స్థాపించకుండా ఖాళీగా వదిలేసిన భూములపై త్వరగా చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పారు. ఒకవేళ ఖాళీగా వున్న భూములు వ్యవసాయానికి పనికిరాకపోతే వాటిలో భారీ పరిశ్రమలను స్థాపించేలా ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.

శుక్రవారంనాడు సీఎం కేసీఆర్ సచివాలయంలోని తన కార్యాలయంలో నూతన పారిశ్రామిక విధాన రూపకల్పనపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమాజంలో అన్ని వర్గాలకు సమానంగా భాగస్వామ్యం కలిగించే విధంగా... జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే విధంగా రూపొందించాలని మంత్రులతో పేర్కొన్నారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు, సంఘాల ప్రతినిధులతో ఒక సదస్సును నిర్వహించి.. పారిశ్రామిక ఏర్పాట్లకు సంబంధించి అన్ని సలహాలను తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం వున్న లోటుపాట్లన్నింటిని సవరించి, మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు.



తెలంగాన రాష్ట్రంలో వుండే అన్ని వనరులను సద్వినియోగం చేసుకునే విధంగా కాలుష్యరహితమైన పరిశ్రమలను స్థాపించి, వాటిని అవసరమైనంత మేర విద్యుత్ ను అందేలా ప్రతిపాదనలు వుండాలని అన్నారు. తెలంగాణాలో వున్న నిరుద్యోగస్తులందరికీ ఉద్యోగవకాశాలు కల్పించే విధంగా అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి ఒక ప్రత్యేక విధానాన్ని అమలు చేయాలని... అలాగే పంచవర్ష ప్రణాళిక వంటి సిద్ధాంతాలను రూపొందించాలని ఆదేశించారు.

తమిళనాడు రాష్ట్రంలో తిరువూరు ప్రాంతం వుండేవిధంగా తెలంగాణను కూడా ఒక  జౌళి మండలంగా రూపుదిద్దుకునేలా ఔళి పార్కులను ఏర్పాటు చేసే ప్రణాళికలను సిద్ధం చేయమని ఆదేశించారు. అందులో ముఖ్యంగా ఈ పార్కును నిర్మించడానికి వరంగల్ ప్రాంతం అనువైనదని.. అక్కడున్న అజాంజాహి భూముల్లో పార్కులను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలోనూ ఔళి పార్కును అభివృద్ధి చేయాలన్నారు. ఇలా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని తన తోటి మంత్రులతో ఆదేశాలు జారీ చేసినట్లు తాజా సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles