Polavaram ordinance a conspiracy alleges mp v hanumantha rao

VHR terms Polavaram Ordinance as conspiracy, MP V Hanumantha Rao fire on venkaiah naidu, polavaram ordinance, congress party, tdp, bjp, telangana state.

polavaram ordinance a conspiracy alleges MP V Hanumantha Rao, MP V Hanumantha Rao fire on venkaiah naidu,

కింద నలుపు ఎలా మరిచిపోయావ్ హనుమన్న?

Posted: 06/17/2014 08:30 AM IST
Polavaram ordinance a conspiracy alleges mp v hanumantha rao

మేము చాలా నిక్కచ్చిగా మాట్లాడతాం అని చెప్పుకునే నాయకులు.. ‘‘గురిగింజ కింద.. నలుపు గురించి మాత్రం ఎలా మరిచిపోతారో ఎవరికి అర్థం’’ కావటంలేదు. సీనియర్ నాయకుడు.. ఎన్నికల్లో ఘోర పరాజయం. వయసు ముదిరిపోవటం, పదవి లేకపోవటం, పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో.. మీడియా ముందుకు రావటం బాగా తగ్గించాడు. గతంలో మీడియా కనిపిస్తే చాలు.. మన హనుమన్న రచ్చ రచ్చ చేసి, మీడియావారికి చెమట్లు పట్టించేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇంత త్వరంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు , వి.హనుమంతరావు రంగులు మార్చుతాడని ఎవరు ఊహించలేదు. అందరి రాజకీయ నాయకులను ఒకేసారి వి.హనుమంతరావు మించిపోయాడు.

ఆయన మీడియా ముందు మాట్లాడిన మాటలు, కొన్ని గంటల్లో .. రంగు, రుచి, చిక్కతనం, లాంటి వాటిల్లు చాలా మార్పులు వస్తాయి. పాపం నెల రోజులు తరువాత మీడియా ముందుకు పోలవరం విషయాన్ని తీసుకొచ్చి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి పై హనుమన్న నిప్పులు కురిపించారు. తనలో ఉన్న రాజకీయ పైత్యం మొత్తం మీడియా కక్కేసాడు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు కుట్ర పన్నారంటూ హనుమన్న ఆరోపించారు.

తెలంగాణలోని వందలాది గ్రామాలను ముంచేసే పోలవరం ప్రాజెక్టుపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కారణంగా అమాయక ఆదివాసీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఖమ్మం జిల్లాలోని అపారమైన ఖనిజ నిక్షేపాలను దోచుకునేందుకునే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని కూడా హనుమన్న ఆరోపించారు.

హనుమన్న వ్యవహారం చూస్తుంటే మొన్న ఎన్నికల ముందు వరకు కేంద్రంలో రెండు సార్లు అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ పాపం తెలియనట్లుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించింది యుపిఎ ప్రభుత్వమే.

venkaiah-naidu-polavaram

అలాగే తెలంగాణలోని ముంపు మండలాలను సీమాంధ్రలో కలపాలని నిర్ణయం తీసుకుంది కూడా మీ పార్టీ ప్రభుత్వమే కదా హనుమన్న గారు! ఎన్నికల ముందు పోలవరంపై ఆర్డినెన్స్ జారీచేయడానికి ప్రయత్నించి ఎన్నికల నిబంధనలు అడ్డురావడంతో దాన్ని ఆపేసింది కూడా యుపిఎ ప్రభుత్వమే కదా బాసూ! పోలవరంపై వెంటనే ఆర్డినెన్స్ జారీచేయాలని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోరింది కూడా అదే కాంగ్రెస్ పెద్దలన్న విషయం హనుమన్న కు తెలియదంటారా? తెలుసు..కాని పోలవరం విషయంలో తెలంగాణలోని ఇతర పార్టీల కన్నా తామెక్కడ వెనుకబడిపోతామోనన్న భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు హనుమన్న.

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు భారతదేశానికి మంత్రా ? లేక ఏపీకి నాయకుడా ? అంటూ హనుమన్న ఫైర్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం నిర్మాణం ఆగదని.. వెంకయ్య నాయుడు మాట్లాడటం తగదన్నారు. ఆయన భారతదేశానికి మంత్రిగా ఉన్నారా లేక ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే మంత్రిగా ఉన్నారా అని ప్రశ్నించారు.

మంటల్లో గ్యాస్ పోసినట్లు గా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. వ్యక్తిగత లాభాల కోసమే వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రధానమంత్రిని కలిసి విన్నవిస్తామని వీహెచ్ పేర్కొన్నారు.అయిన గతంలో తెలంగాణ కేంద్ర మంత్రులు, ఇంతకంటే ఘోరంగా మాట్లాడిన విషయం ఎలా మరిచిపోయావు హనుమన్న. అంతేలే.. ఏదైన తమగా వస్తేగానే..ఆ చలేంటో తెలియదు.

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి కంటే.. గతంలో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఇంతకంటే ఘోరంగా మాట్లాడిన సందర్బాలు చాలు ఉన్నాయని .. సీమాంద్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. హనుమన్న.. ఒక్కసారి సీమాంద్ర నేతలు వద్ద ఇలా పైర్ అవ్వరాదే. సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీ కోట్టుకుపోవటానికి మీ లాంటి నాయకులే కారణం అని అందరికి తెలుసు.

ఇలాంటి దూకుడు మాటలతో.. కాంగ్రెస్ పార్టీకి అధికారం రాకుండా చేసింది ..మీ లాంటి నాయకులే హనుమన్న అన్న విషయం ఎలా మరిచిపోయావు. తెలంగాణ కావలని ..మీ పార్టీ పెద్దల తొడకొట్టేవ్, తొందరిపడి తెలంగాణ తెచ్చుకున్నవ్, చివరకు ఏమైంది.. మీకు, మీ పార్టీకి, అధికారం పోయింది. ఇప్పుడు మీ ఫార్టీ ఆఫీస్సులకు తాళాలు పడ్డాయి. ఇంతకంటే..ఇంకేం కావాలి హనుమన్న. నిన్నటి వరకు తెలంగాణ ఇచ్చింది మేమే, మా దేవత సోనియా గాంధీ అని తెలంగాణ వీదుల్లో భజన చేసిన ఎలా మరిచిపోయి హనుమన్న. ఇకనైన ఇలాంటి మాటల దూకుడు తగ్గించి తెలంగాణ ప్రజలు అభివృద్దికి కృషి చేయాలని హనుమన్న అభిమానులు ఆశగా అడుగుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles