Pm modi gives directives to bureaucrats

PM Modi gives directives to Bureaucrats, Bureaucrats love Modi directions, Civil servants love Modi instructions

PM Modi gives directives to Bureaucrats

ఇట్లు- నడ్డిమీద చరుస్తూ ప్రేమతో- మోదీ

Posted: 06/12/2014 04:11 PM IST
Pm modi gives directives to bureaucrats

బ్యూరోక్రాట్లకు ప్రధాని మోదీ మార్గదర్శకాలిచ్చారు.  

దుమ్ముపట్టిన ఫైళ్ళ దుమ్ము దులపండి.  వరండాలలో పడున్న పనికిరాని వాటిని తీసివేయండి.  అవసరమైతే వారానికి ఆరు రోజులు పనిచెయ్యవలసివస్తుంది.  

దీనివలన ఐఏఎస్ ల నుంచి నిరసన వచ్చిందనుకుంటే అది పొరపాటే.  వాళ్ళింకా ఆనందంగా ఉన్నారు ప్రధాని మాటలకు.  అందుకు కారణం బ్యూరోక్రాట్స్ కి పనిలో స్వేచ్ఛకూడా ఇవ్వటం.  

ఆఫీసుల్లో ఫైళ్ళు కదలకపోవటంతో పాటు ఆఫీస్ గోడల మీద పాన్ తిని ప్రేమగా వేసిన గుర్తులను కూడా లేకుండా కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని మోదీ కోరారు.  

హెల్త్ మినిస్ట్రీ చేసిన ప్రకటన ప్రకారం కారిడార్లలో పడున్న 35 స్టీల్ అల్మైరాలు, 3 వాటర్ కూలర్లు, 40 కుర్చీలను తీసివేసారు.  

ఆంక్షలతో పాటు ప్రధాని మోదీ బ్యూరోక్రాట్స్ ని సృజనాత్మకంగా ఆలోచించమని, పనిని మెరుగుపరచుకోమని, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన నిర్ణయాలను తీసుకోమని అన్నారు.  అంటే పనిచెయ్యటానికి స్వేచ్ఛనిచ్చినట్లే కదా.  అదే వారిని సంతోషపెడుతోంది.  పూర్వ ప్రభుత్వ అవినీతి వలన ఆగిపోయివున్న కార్యకలాపాలను కదిలించిమని కూడా మోదీ చెప్పారు.  

మోదీ వ్యవహార శైలికి, ఆ వేగానికి అందుకోవటానికి మంత్రుల సెక్రటరీలు, సివిల్ సర్వెంట్లు తలమునకలవుతున్నారు.

ఒక పక్క నరాలు తెగే వేగంతో పని చేస్తూనే, ఇతర సంబంధిత అధికారులను కూడా నడ్డి విరిగేట్టుగా పని చెయ్యవలసిన అవసరాన్ని కల్పిస్తూనే,  వాళ్ళు ఆ పనిని ఆనందంగా చేసేట్టుగా చేస్తున్నారు.

దటీజ్ మోదీ! 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles