Seat belt could have saved munde

Wearing seat belt could have saved Munde, Fracture to Munde's C1 C2 cervical spines, damage to Munde's cervical spines stopped brain function,

Wearing Seat belt could have saved Munde

సీటు బెల్ట్ పెట్టుకోకపోవటమే అంత చేసింది?

Posted: 06/04/2014 02:08 PM IST
Seat belt could have saved munde

కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే రోడ్ ప్రమాదం గురించి తెలియగానే ఎయిమ్స్ కి ముందుగా చేరుకున్నది కేంద్ర మంత్రి డా.హర్షవర్ధన్ ఆయన సీటు బెల్ట్ పెట్టుకునుంటే ప్రమాదం నుంచి తప్పించుకునివుండేవారని అన్నారు.  

గోపీనాధ్ ముండే శరీరానికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఆదర్శ కుమార్ ఆయన మొదటి, రెండవ సెర్వికల్ వెర్టిబ్రే కి కలిగిన దెబ్బ వలన ఎముక చిట్లి మెదడుని స్థంబింపజేసి గుండె పనిచెయ్యకుండా చేసిందని తెలియజేసారు.  వెనక సీటులో కూర్చున్న ముండే సీటు బెల్ట్ పెట్టుకునుంటే ప్రాణాంతకమైన దెబ్బలు తగలకుండా ఉండేవని ఆయన అన్నారు.  

హాస్పిటల్ కి చేర్చేటప్పటికే ముండే ఊపిరి ఆగిపోయి కనిపించింది.  ఆ తర్వాత డాక్టర్లు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు.  

సి1, సి2 ఎముకలు చిట్లినట్లయితే మెదడుకు సరఫరా అవవలసిన రక్తం అలా జరగకుండా ఆగిపోతుందని డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు.

గోపీనాథ్ ముండే పెద్ద కూతురు పంకజ ముండే ఆయన చితికి నిప్పంటించారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles