Ysrcp mp butta renuka meets on ys jagan

YSRCP MP butta renuka, MP butta renuka meets on ys jagan, ys jagan, ysrcp, MP butta renuka meets on ys jagan.

YSRCP MP butta renuka meets on ys jagan

జగన్ ఇంట్లో రేణుక- ఊపిరి వదిలిన నేతలు

Posted: 05/31/2014 12:06 PM IST
Ysrcp mp butta renuka meets on ys jagan

వైఎస్ జగన్మోహన్ రెడ్డి లో కొత్త భయాన్ని పుట్టించిన .. ఆయన పార్టీ ఎంపీ ఈరోజు ఇంటికే వచ్చారు. గత కొద్ది రోజులు వైసీపీ నాయకుల్లో అలజడి రేపిన కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక జగన్ తో బేటీ అయ్యారు.

వైకాపా తరపున ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన రేణుక టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును కలుసుకున్న ఆమె భర్త టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే రోజు సాయంత్రం తన భార్య రేణుక కూడా టీడీపీలో చేరుతారని ఆయన చెప్పారు.

అయితే చంద్రబాబుతో భేటీ అనంతరం ఆమె టీడీపీలో చేరనని... వైకాపాలోనే కొనసాగుతానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీనికి గల కారణాలు బయటకు వెల్లడవలేదు.

ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆమె జగన్ నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లో వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆమె ఇక్కడకు విచ్చేశారు. సమావేశానికి ఆమె రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. లోటస్ పాండ్లో ఈ సమావేశం జరుగుతున్నట్లు సమాచారం.

అయితే ముఖ్యంగా ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాల వారీగా సమీక్షలకు సిద్దమైంది. వచ్చే నెల మొదటివారం నుంచి వైఎస్‌ జగన్‌ వారం రోజుల పాటు ఈ సమీక్షలు చేయనున్నారు.

అయితే ఈ సమావేశంలో బుట్టా రేణుక కనిపించటంతో వైసీపీ నాయకులు కొంచెం ఊపిరి (వదిలారు) పిల్చుకున్నారు. కానీ జగన్ మాత్రం రేణుకు గురించి సమావేశంలో ఎలాంటి చర్చలు జరగలేదని వైసీపీ నాయకులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles