Kejriwal judicial custody extended to 14 days more

Kejriwal Judicial custody extended to 14 days more, Nitin Gadkary libel case on Kejriwal, Kejriwal jailed for non payment for bail, Kejriwal refuses bail

Kejriwal Judicial custody extended to 14 days more

కేజ్రీవాల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు

Posted: 05/23/2014 02:59 PM IST
Kejriwal judicial custody extended to 14 days more

రాజ్యాంగబద్ధమైన హోదాలో పనిచేసిన మీనుంచి ఇంకా ఎక్కువ బాధ్యతాయుతమైన ప్రవర్తనను ఆశిస్తున్నాం- ఇవి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మీద విచారణ జరుగుతున్న పరువునష్టం దావాలో మేజిస్ట్రేట్ ఆయనతో అన్న మాటలు.   

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీ నాయకుడు నితిన్ గడ్కరీ మీద నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గడ్కరీ వేసిన పరువునష్టం దావాలో కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల వరకు పొడిగిస్తూ కేసు విచారణను జూన్ 6 కి వాయిదా వేసారు మెట్రోపోలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మినోచా.   

కేజ్రీవాల్ కి జ్యుడిషియల్ కస్టడీ విధించటం మీద ప్రశ్నించిన కేజ్రీవాల్ ని కావాలంటే దాని మీద పై కోర్టుకి అప్పల్ చేసుకోవచ్చని మేజిస్ట్రేట్ అన్నారు.  

రెండు రోజుల క్రితం కేజ్రీవాల్ ని అరెస్ట్ చెయ్యమని కోర్టు ఆదేశించగా, తానే తప్పూ చెయ్యలేదని కేజ్రీవాల్ నేరాన్ని ఒప్పుకోవటానికి నిరాకరించారు.  జైలుకి వెళ్ళటానికి సిద్ధపడ్డారు కానీ ఆయన పదివేల రూపాయల బెయిల్ బాండ్ ని ఇవ్వటానికీ నిరాకరించారు.  ఆ కేసు ఈ రోజు మళ్ళీ విచారణకు రాగా కేజ్రీవాల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు మేజిస్ట్రేట్  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles