Cm and ministers in new andhra pradesh

CM and Ministers in New Andhra Pradesh, Seemandhra CM, Chandrababu Naidu CM for new State, TDP to get power in AP

CM and Ministers in New Andhra Pradesh

నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఎవరు?

Posted: 05/15/2014 11:01 AM IST
Cm and ministers in new andhra pradesh

నూతన ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు, ఆయన మంత్రి వర్గం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా ఉన్న విషయం.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంగా పిలవబడుతున్న ప్రాంతం వరకు జూన్ 2 న అప్పాయింటెడ్ డే తర్వాత తెలంగాణా ప్రాంతం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గా కుదించబడుతోంది.  ఆ నూతన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఎవరు స్థాపిస్తారు, వారి మంత్రివర్గం ఎలా ఉండబోతుందన్నది ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమైంది.  ఎక్కడ చూసిన దీనిమీద చర్చలే వినిపిస్తున్నాయి.  దానితో ఆసక్తి పెరిగి అడిగితే, ఇంకెవరు తెలుగు దేశం పార్టీయే అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని అధిక శాతం ఖరాఖండిగా చెప్తున్నారు.  అందుకు కారణం ఎగ్జిట్ పోల్ సర్వేలు, ముఖ్యంగా మాజీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన సర్వే రిపోర్ట్.  

ఆయన చేసిన సర్వే ప్రకారం చూస్తే తెదేపా అధికారంలోకి వస్తుందని, వైకాపా ప్రతిపక్షంలో కూర్చుంటుందని తెలుస్తోంది.  ఒకవేళ అదే జరిగి కుప్పం నుండి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసినట్లయితే ఈ క్రింది నాయకులు మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

1.యనమల రామకృష్ణుడు- తుని నుంచి పోటీ చేస్తున్నారు, 2. గంటా శ్రీనివాసరావు- భీమిలి, 3. కోడెల శివప్రసాద్- సత్తెనపల్లి, 4. దేవినేని ఉమా మహేశ్వరరావు- మైలవరం, 5. పయ్యావుల కేశవ్- ఉర్వకొండ, 6. అయ్యన్నపాత్రుడు- నర్సీపట్నం, 7. గాలి ముద్దు కృష్ణమ నాయుడు- నగరి, 8. తోట త్రిమూర్తులు- రామచంద్రాపురం లాంటి సీనియర్ నాయకులు తెదేపాలో ఉన్నారు. ఇంకా 9. పరిటాల సునీత- రాప్టాడు,  కొత్తగా క్రియాశీల రాజకీయాలలో అడుగుపెట్టిన నటసింహం 10. నందమూరి బాలకృష్ణ- హిందూపురం ఉన్నారు.  వీరు కాకుండా కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన సీనియర్లున్నారు.  వారు, 11. జెసి దివాకర రెడ్డి- తాడిపత్రి, 12. ఏరాసు ప్రతాప రెడ్డి- పాణ్యం, 13. టి.జి.వెంకటేశ్- కర్నూల్, 14. పితాని సత్యనారాయణ-అచంట, 15.శత్రుచర్ల విజయరామరాజు- పాతపట్నం, శ్రీకాకుళం, 16. గల్లా అరుణ కుమారి- చంద్రగిరి

వీళ్ళు కాకుండా భాజపా తరఫున ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థులలో గెలిచినవారిలో కనీసం ఒకరికి మంత్రి పదవిని ఇవ్వవలసిరావొచ్చు.

ఇందులో, నందమూరి బాలకృష్ణ ఇంటి మనిషే కనుక వెంటనే మంత్రి పదవి ఇవ్వకపోయినా పరవాలేదు కాబట్టి ఆయనకు ఇవ్వాలా వద్దా ఇస్తే ఏ శాఖను ఇవ్వాలన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు చివర్లో ఆలోచించవచ్చు.  మిగిలిన పదిహేను మందికి మంత్రిత్వ శాఖలను అప్పగించవచ్చు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles