Time over for campaigning in seemandhra

Time over for campaigning in Seemandhra, Election Chief Officer Bhanwarlal, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Time over for campaigning in Seemandhra

ప్రచారానికి లాంగ్ బెల్

Posted: 05/05/2014 05:26 PM IST
Time over for campaigning in seemandhra

ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు 10 అసెంబ్లీ స్థానాలలోను, ఆరు గంటలకు మిగిలిన 165 స్థానాలలోను ఎన్నికల ప్రచారానికి లాంగ్ బెల్ కొట్టటం జరిగింది.  

మే 7 న జరిగే 25 పార్లమెంటు స్థానాలలోను 175 అసెంబ్లీ స్థానాలలోను ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తగు చర్యలతో సంసిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలియజేసారు.  

ఎన్నికల సిబ్బంది, ఇవిఎమ్ ల తరలింపు ప్రారంభమైందని, మే 7 న ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ ఉంటుందని చెప్పిన భన్వర్ లాల్, వోటర్ స్లిప్ లను అందరికీ అందించే ఏర్పాటు చేసామన్నారు.  

పోలింగ్ రోజున పూర్తిగా సెలవు ప్రకటించాలని అలా చెయ్యనివారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయని కూడా భన్వర్ లాల్ అన్నారు.  వోటు హక్కులేని నాయకులు వెంటనే ఎన్నికలు జరుగుతున్నప్రాంతాలను వదిలి వెళ్ళిపోవాలని కూడా భన్వర్ లాల్ ఆదేశించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles