Modi says may sonia s wish come true

Modi says may Sonia's wish come true, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Modi says may Sonia's wish come true

సోనియా మాటకు "తథాస్తు" అన్న మోదీ!

Posted: 05/05/2014 03:56 PM IST
Modi says may sonia s wish come true

"తెరే మూ మే ఘీ షక్కర్" అనే హిందీ నానుడికి తెలుగు అనువాదం "నీ నోటిని తీపి చెయ్య!" అని.  ఎవరి మాటైనా నిజమైనప్పుడు వాళ్ళ నోటిలో తీపి పదార్థాన్ని వెయ్యటం జరుగుతుంది.  దాన్ని ఉపయోగిస్తూ, మోదీ తనను తాను ప్రధాన మంత్రిగా భావిస్తున్నారన్న సోనియా గాంధీ వ్యాఖ్యకు ఆయన ఆ విధంగా "తథాస్తు" అని పలికారు.  మోదీ తనను తాను ప్రధానిగా భావిస్తున్నారు అని సోనియా గాంధీ అన్నారని, అందుకు బదులుగా నేనేం చెప్పగలను మేడమ్ జీ, ఆప్ కే ముహ్ మే ఘీ షక్కర్ అనటం తప్ప అన్నారాయన.  

దేశంలో ఈసారి రాజకీయాలలో ఎప్పుడూ ఉండే రాజకీయపు ఎత్తుకు పై ఎత్తులతో పాటు ఛలోక్తులు, పద చమత్కారాలు, భాషాపరంగా ఎత్తిపొడుపులు ఎక్కువయ్యాయి.  

కాంగ్రెస్ పార్టీ నాయకులు మోదీని ఉద్దేశించి "ఏ దిల్ మాంగే మోర్" అన్న వ్యాపార ప్రకటనను ఉపయోగించి మోదీని ఎన్నికలలో ప్రధానమంత్రి అయ్యే ఇచ్చను విమర్శించగా, "ఏం చేస్తాం, పేదవాడికి అడిగి తీసుకోవటమే తెలుసు మరి!" అన్నారాయన.  "వోట్లు అడుక్కోవటానికి వాళ్ళకి సిగ్గనిపిస్తున్నదేమో కానీ నాకు మాత్రం అందులో లజ్జాకరమైన విషయం కనపడటం లేద"న్నారు మోదీ.  

ఇప్పటివరకూ షెహజాదా (యువరాజు) అని రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండా అంటూ వచ్చారు మోదీ.  కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మోదీ పేరుతోనే ఆయన ప్రధానమంత్రి అంటున్నారంటూ భాజపా నాయకులు సంతోషాన్ని వ్యక్తపరచారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles