Muslims misconcept will go when bjp comes to power

Muslims misconcept will go when BJP comes to power, Modi aide Amit Shah, Elections 2014, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Muslims misconcept will go when BJP comes to power Amit Shah says

భాజపా అధికారంలోకి రాగానే ముస్లింల శంకలు దూరం!

Posted: 05/05/2014 02:05 PM IST
Muslims misconcept will go when bjp comes to power

ముస్లిం సోదరులకు భారతీయ జనతా పార్టీ పట్ల కొన్ని అపనమ్మకాలున్నాయని, అందుకు కారణం ప్రతిపక్ష నేతలు వేసిన నిందలని, భాజపా అధికారంలోకి రాగానే ముస్లింలకు ఈ పార్టీ మీదున్న శంకలన్నీ తొలగిపోతాయని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీకి అతి సన్నిహితుడైన అమిత్ షా అన్నారు.  ముస్లింల మనుసులోని అభద్రతా భావం కేవలం కాంగ్రెస్ పార్టీ సృష్టేనని అన్నరాయన.  

కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినట్లయితే పూర్తిగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందే కానీ వేరుగా కాదని, ఈ విషయంలో ప్రధాని మోదీ అయినా వాజ్ పాయ్ అయినా తేడా ఏమీ లేదని, దేశాన్ని రాజ్యాంగం నిర్దేశించిన విధానంలో నడిపించటమే జరుగుతుందని అమిత్ షా ఎన్ డి టివి ఇంటర్వ్యూలో అన్నారు.  

భాజపా కలలుగనే దేశానికి, మోదీ ఆలోచనలకు మధ్య తేడా ఏమీ లేదని, ఒక ముఖ్యమంత్రిగా మోదీ గుజరాత్ ని తీర్చిదిద్దారని, అలాగే సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ పరిస్థితులను కూడా ఆయన చక్కదిద్దుతారని అన్న అమిత్ షా, మోదీ ప్రణాళికకు, భాజపా ప్రణాళికకు ఏమాత్రం వ్యత్యాసం ఉండదని, భాజపా అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాలలో కూడా ఈ విషయం నిరూపితమైందని, ఇదే విషయం జాతీయ స్థాయిలో కూడా అందరికీ అవగతమై ముస్లిం సోదరుల మదిలోని అభద్రతా భావం తొలగిపోతుందని అన్నారు.  రాజ్యాంగబద్ధంగా నడిచే మా పార్టీ దేశంలో అందరినీ సమానంగా చూస్తుందని ఆయన అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles