Chandrababu announced to telangana cm bc r krishnaiah

chandrababu, chandrababu naidu, tdp, R krishnaiah, telangana cm R krishnaiah, LB Nagar, telangana CM BC R krishnaiah, chandrababu and r krishnaiah, TDP CM candidate for Telangana, Elections 2014.

chandrababu announced to telangana CM BC R krishnaiah

తెలంగాణ లో బాబు ‘బుల్లెటే ’ముఖ్యమంత్రి?

Posted: 04/23/2014 04:32 PM IST
Chandrababu announced to telangana cm bc r krishnaiah

తెలంగాణ రాష్ట్రంలో  ఎల్బీ నగర్ ‘బుల్లెట్ ’ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు  ఈరోజు ప్రకటించారు. చంద్రబాబు  ఇచ్చిన మాట ప్రకారమే.. తెలంగాణ రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు బయట పెట్టారు. ఇప్పటి  వరకు  ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం  చంద్రబాబు  చూపించారు.   

అసలు ఈ ఎల్బీనగర్ బుల్లెట్ ఎవరు అనుకుంటున్నారా?  జరుగుతున్న ఎన్నికల సమరంలో  తెలుగుదేశం పార్టీ నుండి ఎల్బీనగర్ నియోజక వర్గం లో పోటీ చేస్తున్న  ఆర్ క్రిష్ణయ్య.  ఈరోజు ఆదిలాబాద్ జిల్లా  బెల్లంపల్లి  బహిరంగ సభలో  చంద్రబాబు మాట్లాడుతూ  ఈ ప్రకటన చేయటం  జరిగింది.  

తెలంగాణలో  పెత్తందాలర్ల పాలన పోయి  గరీబోళ్ల పాలన రావాలని  చంద్రబాబు అన్నారు.  దొరల పాలనకు ఆస్కారం  ఇచ్చే ప్రశ్నేలేదని  ఆయన  స్పష్టం చేయటం జరిగింది.  మన దేశానికి  బీసీ ప్రధాని కాబోతున్నారని, దశాబ్ధాలుగా  బీసీల సంక్షేమం కోసం కష్టపడిన  వ్యక్తే రాష్ట్రంలోనూ బీసీ ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు అన్నారు. 

చంద్రబాబు రీసెంట్ తెలంగాణలో బీసీ లకే  ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ జరగక ముందే బాబు తెలంగాణ రాష్ట్రానికి బీసీ వ్యక్తి అయిన ఆర్ క్రిష్ణయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించటంతో బీసి సంఘాలు, తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.  ఇచ్చిన మాటకు కట్టుబడిన నాయకుడిగా చంద్రబాబు తెలంగాణ ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సైకిల్ దూసుపోతుందని  రాజకీయ మేథావులు అంటున్నారు.  

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles