Ysrcp candidate held distributing money

YSRCP candidate held distributing money in Kadapa, YSR Congress party, Kadapa Rajagopala reddy arrested, local body elections in AP State

YSRCP candidate held distributing money in Kadapa, YSR Congress party

డబ్బుల పంపిణీలో అరెస్టైన వైకపా అభ్యర్థి

Posted: 03/28/2014 09:41 AM IST
Ysrcp candidate held distributing money

కడపలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల రెడ్డి వోటర్లకు డబ్బులు పంచుతున్న సమయంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. 

రాజగోపాల రెడ్డి తో పాటుగా అదే పనిలో ఉన్న మరో ఇద్దరు వైకాపా కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.  పోలీసులకు దొరికినప్పుడు వాళ్ళ దగ్గర పంచని నగదు పదివేల రూపాయలున్నాయి.  వాటిని స్వాధీనం చేసుకన్నామని పోలీసులు అన్నారు.

ప్రస్తుతం ముందుగా జరుగనున్నవి స్థానిక ఎన్నికలు కాబట్టి తక్కువ డబ్బే పంపిణీలో ఉండటం జరగింది.  ఈ లెక్కన సార్వ్రతిక ఎన్నికల్లో ఇంకా ఎంత డబ్బు చేతులు మారతాయో అనుకుంటున్నారు అధికారులు. 

అయితే డబ్బు అందకుండా మధ్యలో ఆగిపోవటంతో నిరాశపడ్డ వోటర్లు కూడా ఉంటారు.  పోయినసారి ఎన్నికలలో గ్రామంలోని వారంతా వోటేసి వచ్చిన తర్వాత తమకి డబ్బు ముట్టలేదని పార్టీల మీద ఆగ్రహాన్ని చూపించినవారూ ఉన్నారు. 

డబ్బు తీసుకోబట్టే కదా డబ్బు ఇవ్వటం కూడా జరుగుతోంది,  అందువలన సమాజంలో మార్పనేది అందరిలోనూ రావాలంటారు సంఘ సంస్కర్తలు.  కానీ చాలీచాలని బ్రతుకులలో రోజులు గడుపుతున్నవాళ్ళకి ఎన్నికలు వస్తున్నాయంటే పండగే.  అందుకే, వాళ్ళ అవసరాలను చూసి వాళ్ళకి ఎరవేసే అభ్యర్ధులనే తప్పు పట్టటం జరుగుతోంది.  అవసరాలే కాకుండా మన దేశంలో విశ్వాసపాత్రత కూడా ఎక్కువే. 

డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా వాళ్ళు అనుకున్నవాళ్ళకే వోటు వెయ్యవచ్చు నిజానికి.  కానీ అలా చెయ్యరు.  అది జీర్ణించుకువోయిన భారతీయ సంస్కారం.  అందుకే, ఆ సంస్కారాన్ని, వోటర్ల అవసరాలను, బలహీనతలను ఉపయోగించుకుని లాభపడదామనుకునే వాళ్ళ మీద నిఘా పెట్టటం వలన అవి తగ్గిపోయి, ఎన్నికలు సజావుగా సాగుతాయన్నది ఎన్నికల కమిషన్ అభిప్రాయం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles