Pawan kalyan leaves for delhi

Pawan Kalyan leaves for Delhi, Pawan Kalyan Janasena Party, Pawan Kalyan meets Modi, Telugu Desam party, Janasena for social justice

Pawan Kalyan leaves for Delhi, Pawan Kalyan Janasena Party, Pawan Kalyan meets Modi

రాజధానికి పవన్ ప్రయాణం

Posted: 03/20/2014 04:35 PM IST
Pawan kalyan leaves for delhi

ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో వెళ్తున్నారు. 

శుక్రవారం ఉదయం ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జనసేన పార్టీకి సంబంధించిన అధికారిక పనులను నిర్వహించుకుని మధ్యాహ్నం అహ్మదాబాద్ వెళ్తారు.  అహ్మదాబాద్ లో భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా రాజకీయ చర్చలు చేస్తారు. 

అధికారం కాదు కావలసింది రాష్ట్రం అభివృద్ధి, దేశ సౌభాగ్యం, దానికోసం కాంగ్రెస్ ని తరిమికొట్టాలన్న తన సిద్ధాంతాన్ని వివరణాత్మకంగా బహిరంగంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ మద్దతుని ఏ కాంగ్రేసేతర పార్టీయైనా స్వాగతిస్తుంది.  సమస్యలు ఘర్షణలు అధికారం కావాలన్న చోట, పోటీలు పడుతున్నచోట మాత్రమే చోటుచేసుకుంటాయి. 

భారతీయ జనతా పార్టీతో కలిసి జాతీయ స్థాయిలోను, తెలుగు దేశం పార్టీకి మద్దతుగా నిలిచి రాష్ట్రంలో ఉభయ ప్రాంతాలలోను జనసేన ద్వారా సమన్యాయం చెయ్యటానికి పాటుపడాలన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం. 

కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నది తెలుగులో సామెత.  రాజకీయంగా పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులను చూస్తుంటే, తెలుగు దేశం పార్టీలోకి నాయకుల వలసలతోనే కాకుండా జనసేన మద్దతు వలన కూడా బలోపేతమయ్యే అవకాశం బాగా కనపడుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles