ప్రపంచ వ్యాప్తంగా ఆచూకీ తెలియని మలేషియా విమానం గురించి లక్షలాది మంది ఆదుర్దా పడుతూ గాలింపు చర్యలు మొదలుపెట్టి ఏ నిర్ణయానికీ రాలేని సందర్బంలో హైద్రాబాద్ గచ్చిబౌలి లో తన ఆఫీసులో పనిచేస్తూ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి దర్యాప్తుకి కీలకమైన అంశాన్ని అందించగలిగారు.
ఐటి అనలిస్ట్ గా పనిచేస్తున్న అనూప్ మాధవ్ యగ్గిన, శాటిలైట్ ఫోటోలను కొద్ది రోజులుగా వెతుకుతూ చివరకు ఈ ఇమేజ్ ని పట్టుకున్నారు. ఇది మార్చి 8 న మలేషియా నుంచి బయలుదేరి అండమాన్ ద్వీపం మీదుగా తక్కువ ఎత్తులో పయనిస్తూ ఉన్న బోయింగ్ 777 విమానమని తెలుస్తోంది. క్రౌడ్ సోర్సింగ్ ప్రాజెక్ట్ లో పనిచేసి కనిపెట్టిన ఈ ఇమేజ్ ని అనూప్ మార్చి 14 న సిఎన్ఎన్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసారు. దానితో పాటుగా, అది మలేషియన్ విమానమేనని రూఢి చేసుకోవటానికి ఆయన వివరణ కూడా ఇచ్చారందులో.
ఇది ఆచూకీ తెలియకుండా పోయిన మలేషియా విమానానికి చెందిన ఇమేజ్ అని నేను గట్టిగా నమ్మటానికి కారణాలు ఇవి-
ఈ విమానం అండమాన్ దీవిలో అడవి మీద తక్కువ ఎత్తులో ఎగురుతోంది, షిబ్ పూర్ ఎయిర్ స్ట్రిప్ కి సమీపంలో ఉంది. ఈ ఎయిర్ స్ట్రిప్ డిఫెన్స్ వాళ్ళు ఉపయోగించేది కాబట్టి దీని మీది నుంచి పోవటానికి అనుమతి తీసుకోవలసివుంటుంది, పౌర విమానాలకు అనుమతి లభించదు. రాడార్ పరిశీలన నుంచి తప్పించుకోవటం కోసం ఈ విమానం చాలా కిందిగా ప్రయాణం చేస్తోందన్నిది దీన్ని గమనిస్తే తెలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆచూకీ తెలియకుండా పోయిన విమానం కొలతలు, రంగులు ఈ ఇమేజ్ తో సరిపోలుతున్నాయి.
విమానంలో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకుల భద్రతను ఆశిస్తూ, అనూప్ ఆన్ లైన్లో ఆ విమానం ఆచూకీ ఇంకా తీయటం కోసం కృషి చేస్తున్నవారికోసం కొన్ని సాంకేతిక సూచనలను కూడా అందించారు.
దీనితో దారిమళ్ళించారన్నది రూఢి అవుతోంది, విమానం పయనించిన దిశ కూడా తెలిసింది కాబట్టి, మలేషియన్ విమానం అక్కడి నుండి ఎక్కడి పోయిందన్నది ఆచూకీ తీయటం సులభమయ్యే అవకాశం ఉంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more