Tdp cm candidate will be bc

TDP CM candidate will be BC, Chandrababu Naidu, R Krishnaiah, BC leader R krishnaiah T CM, TDP BC CM R Krishnaiah, TRS party, Dalit CM for Telangana

TDP CM candidate will be BC, Chandrababu Naidu

తెలంగాణాలో తెదేపా సిఎం అభ్యర్థి ప్రకటన త్వరలో

Posted: 03/18/2014 08:55 AM IST
Tdp cm candidate will be bc

తెలుగు దేశం పార్టీ కి బిసి పార్టీగా ఉన్న పేరును సార్ధకం చేస్తూ, బిసి ని తెలంగాణాలో ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేస్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటించనున్నారని సమాచారం.

బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన తెలుగు దేశం పార్టీకే మా మద్దతంటూ లోగడ బిసి నాయకుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.  అయితే  ఆయన ఇంకా తెదేపాలో చేరలేదు. ఆర్. కృష్ణయ్యను లాంఛనప్రాయంగా తెదేపాలో చేర్చుకుంటూ పార్టీ తరఫునుంచి బిసి ముఖ్యమంత్రిగా బహిరంగ ప్రకటన చెయ్యటానికి చంద్రబాబు వేదికను సిద్ధం చేస్తున్నారు. 

దళితుడినే సిఎం చేస్తానని అంతకు ముందు అన్న తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఆ విషయంలో వెనక్కి తగ్గటంతో తెలంగాణాలో అధిక సంఖ్యాకులుగా ఉన్న బిసి వర్గాలు తెలుగుదేశం పార్టీకి వోటువేస్తాయని నమ్ముతున్న చంద్రబాబు తన పార్టీ బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పటమే కాకుండా చేసి చూపించినట్లయితే తెరాస కంటే ఒక మెట్టు ఎక్కినట్లవుతుందని భావిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles