Devotees throng shiva temples on the occasion of shivratri

Devotees throng Shiva temples on the occasion of Shivratri, Srisailam, Kapila Teertham, Bhimavaram Someswara temple

Devotees throng Shiva temples on the occasion of Shivratri

శివరాత్రి సందర్భంగా శివభక్తులతో నిండిపోయిన శివాలయాలు

Posted: 02/27/2014 09:31 AM IST
Devotees throng shiva temples on the occasion of shivratri

ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలన్నీ భక్తజనసందోహంతో నిండిపోయింది.  శివభక్తులు హరహర మహాదేవ అంటూ స్నానాలు ఆచరించి ఆలయంలో శివదేవుని దర్శనార్థం బారులు తీరి తమ వంతు కోసం వేచి చూస్తున్నారు.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో భక్తులకు స్వామి దర్శనం కోసం 10 గంటలు వేచివుండాల్సిన పరిస్థితి ఉంది.  కేంద్ర మంత్రి పురంధేశ్వరి శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు.  రేణిగుంట సమీపంలోని శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీస్వరుడు ప్రసూనాంబ దర్శనం కోసం తెల్లవారు ఝాము 2.00 గంటల నుంచి భక్తులు క్యూలలో నిలబడ్డారు.  దర్శనానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతోంది.  తిరుపతిలోని కపిలతీర్థం భక్తుల సందోహంతో కిటకిటిలాడుతోంది.  శివనామస్మరణతో భక్తులంతా ఆలయంలో భక్తి తరంగాలను నింపుతున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సోమేశ్వరాలయంలో తెల్లవారు ఝామునుంచే బారులుతీరి వేచివున్న భక్తుల రద్దీ పెరుగుతూ పోతోంది.  ఇది పంచారామ క్షేత్రం.  గుంటూరు జిల్లా కోటప్పకొండ, హైద్రాబాద్ లో కీసరగుట్ట ఇంకా వివిధ శివాలయాలు, గణేషాలయాల దగ్గర కూడా భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరివున్నట్లుగా సమాచారం అందుతోంది. 

ఈ రోజు ఉదయం నుంచి ఉపవాసముండే భక్తులు రాత్రికి జాగరణ చేస్తారు.  నెల నెలా మాస శివరాత్రి వచ్చినా, సంవత్సరానికి ఒకసారి మాఘమాసం కృష్ణపక్షంలో త్రయోదశినాడు వచ్చే మహాశివరాత్రి పరమ పుణ్య దినంగా భావిస్తారు హిందువులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles