Liquor can be stopped in elections but not drunken voters

Liquor can be stopped in elections but not drunken voters, 2014 elections, Election Commission of India, Liquor sales banned during elections

Liquor can be stopped in elections but not drunken voters

మందు పారకుండా ఆపగలరు కానీ మందుబాబులను కాదు!

Posted: 02/13/2014 10:18 AM IST
Liquor can be stopped in elections but not drunken voters

రాబోయే ఎన్నికలలో మందు పారకుండా కట్టుదిట్టాలు చేస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ హామీ ఇస్తున్నారు.  కానీ, మందుబాబులం మేమూ మందుబాబులం..... అంటూ ఎన్నికలకు వస్తే ఓటు వెయ్యవద్దని అడ్డు పెట్టటానికి రాజ్యాంగం అధికారాలిచ్చిందా అంటే లేదనే చెప్తుంది ఎన్నికల కమిషన్. 

ఏ ప్రలోభానికీ లొంగకుండా, ఎటువంటి ఒత్తిడిలూ, ఏ బెదిరింపులకూ లోబడకుండా స్వచ్ఛందంగా తన మనసుకి తోచిన నాయకుడిని ఎన్నుకోవటానికి వోటున్న ప్రతివారికీ హక్కుంది.  ఎవరు ఎవరికి వోటేసారే తెలియకుండా ఉండటం కోసమే సీక్రెట్ బ్యాలెట్ అమలులో ఉంది.  అందువలన దేనికీ భయపడకుండా మొఖమాటాలకు తావు లేకుండా వోటర్ తన హక్కుని వినియోగించుకోవచ్చు.  ప్రభుత్వాన్ని నడిపే నాయకులను ఎన్నుకోవటానికి తగిన మానసిక ఎదుగుదల ఉన్నవాళ్ళకే ఆ హక్కుని రాజ్యాంగం ప్రసాదించింది.  అంటే మైనారిటీ దాటిన తర్వాతనే వోటు హక్కు లభిస్తుంది.

కానీ మత్తులో జోగేవాళ్ళ మెదడు వాళ్ళ అదుపులో ఉంటుందా.  అలాంటివాళ్ళు నిజంగా సరైన నిర్ణయం తీసుకోగలిగే స్థితిలో ఉంటారా.  మైనార్టీ దాటినంత మాత్రాన సరిపోతుందా. 

వోటర్లను ఎటువంటి ప్రలోభాలకూ గురికాకుండా చూసే బాధ్యత ఎన్నికల కమిషన్ మీదనే ఉంది.  అందుకే ఎన్నికల కమిషన్ కి ఎన్నికల సమయంలో పోలీసు మద్దతు సంపూర్ణంగా ఉంటుంది.  ఎన్నికలు జరిగే సమయంలో వైన్ విక్రేతలను కట్టడి చెయ్యటం జరుగుతుంది.  బెల్ట్ షాపుల మీద నిఘా ఉంటుంది.  అక్రమంగా లిక్కర్ తరలించకుండా తనిఖీలుంటాయి.  అయినా అధికారులకు తెలిసో తెలియకుండానో తెరమరుగున లిక్కర్, డబ్బు వితరణ జరుగుతూనేవుంటుంది. 

రెండు రోజుల ముందుగానే లిక్కర్ ని ఇంట్లో పెట్టుకుని ఆరోజు ఫుల్ గా తాగి వోటెయ్యటానికి పోతే ఏం చెయ్యగలరు. 

అందువలన సరైన నియంత్రణ ఏమిటంటే, ఎన్నికల సమయంలో మద్యపానాన్నే పూర్తిగా నిషేధించాలి.  మద్యం సేవించి వచ్చిన వోటర్లకు వోటు హక్కుండగూడదు.  ఒకసారి వోటు వేసినవారికి మరోసారి వెయ్యటానికి హక్కు ఎలాగైతే ఉండదో అలాగే ప్రతివాళ్ళనీ టెస్ట్ చేసి ఏ డ్రగ్స్ లేక లిక్కర్ ప్రభావంలో లేరని తెలిస్తేనే వాళ్ళని వోటు వెయ్యటానికి అనుమతించాలి. 

ఎన్నికల కమిషన్ తలచుకుంటే ఈ పని చెయ్యగలుగుతుంది.  వోటర్ ని ప్రభావితం చేసే ప్రచారాలనే 24 గంటల ముందు నిషేధించిన ఎన్నికల కమిషన్, ఆ పని చెయ్యటానికి కారణం వోటర్ ఆ సమయంలో స్వతంత్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావటం కోసం.  అలా నిర్ణయం తీసుకునే స్థితిలో లేకపోతే వోటర్ ని వోటు హక్కుని వినియోగించనిచ్చినట్లయితే అనర్హులకు పట్టం కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికల సమయంలో లిక్కర్ ని అందుబాటులో ఉంచకపోవటం, రాజకీయ పార్టీలు వోటర్లను ప్రలోభపెట్టటానికి సరఫరా చెయ్యనీయకపోవటమే కాదు రోడ్ల మీద డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన విధంగా ఎన్నికలప్పుడు కూడా నిర్వహించగలిగితే చాలా మార్పు వస్తుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles