Bjp going near general public for political gain

BJP going near general public for political gain, BJP State President Kishan Reddy, Narendra Modi, Venkayya Naidu, AAP Arvind Kejriwal

BJP going near general public for political gain

ఆఆపా దారిలో ఎన్నికలకు కసరత్తు చేస్తున్న భాజపా

Posted: 02/07/2014 08:50 AM IST
Bjp going near general public for political gain

ఎన్నికలకు భాజపా కసరత్తులో భాగంగా ప్రజలలోకి వెళ్తున్నారు పార్టీ నాయకులు.  వెంకయ్యనాయుడు సీమాంధ్ర ప్రాంతాలలో టీ దుకాణం ప్రారంభించి స్వయంగా టీ కలిపి ఇవ్వటం చేస్తే రాష్ట్ర అధ్యక్షుడు హైద్రాబాద్ లో హోం వర్క్ మొదలుపెట్టారు.

నెక్లెస్ రోడ్ లో ఎమ్ఎమ్ టి ఎస్ రైలుని ఎక్కిన కిషన్ రెడ్డి హైటెక్ సిటీ వరకు వెళ్ళి మార్గమధ్యంలో ప్రయాణీకులను అందరినీ పలకరిస్తూ పోయారు.  మనందరం నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేద్దామంటూ అందరికీ భాజపా కార్డ్ లను పంచిపెట్టారు. 

అంతటితో ఆగారా, హైటెక్ సిటీలో టీ దుకాణాలవాళ్ళని పలకరించటమే కాకుండా తాను కూడా స్వయంగా టీ కలిపారు.  మరీ సామాన్యుల పార్టీ అని కూడా అనుకోగూడదు కాబట్టి ఐటి ఉద్యోగులను కూడా కలిసిన కిషన్ రెడ్డి మోదీని ప్రధానమంత్రిని చేద్దామంటూ వినతిపత్రాన్ని వాళ్ళకి అందించారు.

రాజకీయ రంగంలో ప్రచారానికి కొత్త పుంతలు తొక్కి చూపించారు ఆఆపా నేత అరవింద్ కేజ్రీవాల్.  ప్రజలకు దగ్గరవటానికి ఆయన పార్టీ పేరు ఆమ్ ఆద్మీ (సామాన్య మానవుడు) అని పెట్టటమే కాకుండా నేను మీలో ఒకడినే అని వీలయినంత వరకు దగ్గరగా వెళ్ళటానికే చూసారు.  దీన్ని స్పూర్తిగా ఏ పార్టీ తీసుకున్నా దానిలో తప్పు లేదు. 

కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపిస్తున్నామని అనుకుంటున్న సమయంలో ఢిల్లీలో ఆఆపా ప్రభంజనం ఆ పార్టీని దిగ్భ్రాంతికి గురిచేసింది.  కానీ ప్రచార విధానాన్ని మాత్రం తన రీతిలో సొంతం చేసుకుంది.  అదే ప్రజలకు చేరువగా వెళ్ళటం.  ఒక నాయకుడిగా ఒక సెకండు కాలం మాట్లాడినా దాని ప్రభావం చాలా ఉంటుంది.  దానికి తోడు చిన్నప్పుడు రైళ్ళల్లో టీలు అందించిన నరేంద్ర మోదీని ఆ కారణంగా విమర్శిద్దామని చూసినవారికి బుద్ధి చెప్తూ ఆ విమర్శను ఆయుధంగా మలుచుకునే ప్రయత్నంలో టీ దుకాణాల ప్రారంభోత్సవాలకు పోవటం, టీలు తయారు చేయటం చేస్తున్నారు. 

ఈ విధంగా సామాన్య ప్రజలకు దగ్గరవుతున్నాం అనే మాట చెప్పకుండానే, నేను సామాన్య మానవుడిని అనే ఆఆపా నినాదాన్ని అనుకరించకుండానే ఎన్నికల ప్రచారం కోసం చాయ్ వాలా అనే పేరుని మోదీ సంతోషంగా స్వీకరించటం, దాన్ని మిగిలిన నాయకులు కూడా యధోచితంగా ప్రచారం చెయ్యటం చూసి దీనికంతటికీ కారణమైన నాయకుల మీద ఆగ్రహం కలుగుతోంది కాంగ్రెస్ యువరాజుకి.

గురువారం పార్టీ సభ్యులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ, ఎవరినీ వ్యక్తిగతంగా దూషించవద్దని ఆదేశించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles