Jairam ramesh accepted govt failure

Jairam Ramesh accepted govt failure, Welfare funds DTH, welfare delivery failure admitted, Govt failure in welfare distribution, DTH in Welfare delivery system, Direct to home welfare fund

Jairam Ramesh accepted govt failure, Welfare funds DTH

తప్పొప్పుకున్న జైరాం రమేష్

Posted: 02/04/2014 04:50 PM IST
Jairam ramesh accepted govt failure

సంక్షేమ పథకాలలో పంపిణీ సవ్యంగా జరగలేదని గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేష్ ఒప్పుకున్నారు.  సంక్షేమ నిధులలో ఎంతో డబ్బు ఉన్నా, నిజానికి చాలా తక్కువ ప్రమాణంలో నిజమైన లబ్ధిదారుడికి అందాయని ఆయన అంగీకరించారు.  

వెల్ఫేర్ డెలివరీ సిస్టమ్ లో లోపాన్ని పూరించటానికి ఇక బ్యాంక్ లో జమకట్టటం లేదా పోస్టాఫీస్ లో జమకట్టటం కాదు నేరుగా లబ్ధిదారుడి కుటుంబానికి (డిటిహెచ్) చేరవేస్తామని జైరాం రమేష్ అన్నారు.

ఈ డిటిహెచ్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2 న ఆంధ్ర ప్రదేశ్ తో ప్రారంభిస్తున్నామని ప్రకటించిన జైరాం రమేష్  ఇంతవరకు లబ్ధిదారులకు సంక్షేమ నిధులను చేరవేయటంలో లీకేజ్ ఎక్కువ, కవరేజ్ తక్కువగా జరిగిందని అన్నారు.  రాబోయే రెండు సంవత్సరాల కాలంలో దేశంలో వేజెస్ కానీ, పెన్షన్ కానీ, ప్రసూతి బెనెఫిట్ కానీ, సబ్సిడీ సొమ్ము కానీ ఎలక్ట్రానిక్ డెలివరీ విధానంలో నేరుగా లబ్ధిదారుల ఇళ్ళకే పంపిచే ఏర్పాట్లు జరుగుతాయని ఆయన అన్నారు.  

ఆధునిక వైజ్ఞానిక అభివృద్ధితో మైక్రో ఎటిఎమ్ ల ద్వారా ఇది సాధ్యమని జైరాం రమేష్ అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles