Couple hold nude protest outside pmo

Couple strips, Rashtrapati Bhavan,nude protest, pmo, raisina hill, pranab mukherjee, rashtrapati bhavan, varanasi couple

A Couple took off their clothes and held a nude protest outside the Prime Minister's Office on Monday morning.

రాష్ట్రపతి భవన్ ముందు బట్టలిప్పేశారు

Posted: 02/04/2014 01:26 PM IST
Couple hold nude protest outside pmo

భారత ప్రథమ పౌరుడు ఉండే దేశ రాజధాని ఢిల్లీలో వింత సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రపతి భవన్ ముందు భారీ సెక్యూరిటీ ఉంటుంది. ఎవరైనా రాష్ట్రపతిని కలవాలనుకుంటే అంత సులువు కాదు. కానీ ఓ జంట రాష్ట్రపతి భవన్ గేటు  ముందుకు వచ్చి ఆయన్ను కలవాలని సెక్యూరిటీని కోరితే కుదరని చెప్పారు. కాసేపు అక్కడి వారిని బతిమిలాడుకున్నారు.

అయినా సెక్యూరిటీ అనుమతి ఇవ్వకపోవడంతో... చిర్రెత్తుకొత్తిన వారు ఏకంగా అందరు చూస్తుండగానే ఒంటి గుడ్డలు తీసేశారు. దీంతో అక్కడున్న వారు నిర్ఘాంత పోయారు. వారిని బట్టలు వేసుకొమ్మని ఎంత చెప్పినా వినకపోవడమే కాకుండా, అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని పోలీస్ స్టేషన్ కి తరలించి అక్కడ బట్టలు తొడిగారు. వీరు ఇలా చేయడానికి కారణం ఏంటని ఆరా తీస్తే వీరిద్దరికి మతిస్థిమితం లేదని తేలిందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles