Venkayya naidu questions debate on t bill

Venkayya Naidu questions debate on T Bill, Chief Minister Kiran Kumar Reddy, Botsa Satyanarayana, Union Minister Chidambaram

Venkayya Naidu questions debate on T Bill

తె బిల్లు చర్చ మీద వెంకయ్య నాయుడు ప్రశ్నల పరంపర

Posted: 01/24/2014 05:22 PM IST
Venkayya naidu questions debate on t bill

భాజపా సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద చర్చించే విధానాన్ని తప్పు పట్టారు.  ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ క్రింది ప్రశ్నలను సంధించారు.

1. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వ్యక్తిగతమా, పార్టీ తరఫునుంచి మాట్లాడినవా

2. ముఖ్యమంత్రిగా మీ ఆవేదనను మీ పార్టీ అధినాయకత్వానికి చెప్పలేదా

3. మీరు చెప్పినా మీ పార్టీ పెద్దలు పట్టించుకోలేదా

4. అనేక మైన లెక్కలు, చరిత్రలను తవ్వి తీసిన విషయాలతో ప్రసంగించటం ముఖ్యమా ఇప్పుడు.

తెలంగాణా అంశం గురించి పార్టీలో అసలు చర్చించారా లేదా అని చిదంబరాన్ని అడిగానని వెంకయ్య నాయుడు అన్నారు.  దాని మీద విస్తృత చర్చ జరిగిందని వాళ్ళు చెప్పారట.

5. మీరు నిజంగానే చర్చించినట్లయితే ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు కూడా దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.

6. విస్తృత చర్చ జరిగినట్లయితే  ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా మిన్నకుండి ఇప్పుడు బిల్లుని వ్యతిరేకించటమేమిటి

ఈ పై ప్రశ్నలకు ముఖ్యమంత్రి, ఢిల్లీలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమాధానం చెప్పాలని వెంకయ్య నాయుడు అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles