Akkineni nageswara rao passes away

ANR passes away, Akkineni Nageswara Rao Dies, Akkineni Nageswara Rao Dead, Akkineni Nageswara Rao Died, Akkineni Nageswara Rao is no more, akkinenni nageswara rao, Akkineni Nageswara Rao passes away, Natasamrat Akkineni, Legendary Akkineni Nageswara Rao, ANR,Annapurna Studios, ANR passes away, Akkineni Nageswara Rao Dies, Akkineni Nageswara Rao Dead, Akkineni Nageswara Rao Died, Akkineni Nageswara Rao is no more, akkinenni nageswara rao

Akkineni Nageswara Rao passes away, ANR passes away, Akkineni Nageswara Rao Dies

తెలుగు తారాపథంలో కనుమరుగైన అక్కినేని

Posted: 01/22/2014 08:58 AM IST
Akkineni nageswara rao passes away

చిన్ననాటి నుంచే సినిమా రంగంలో చేరి చివరి రోజుల వరకూ అంకిత భావంతో కళా సేవచేస్తూ కన్ను మూసారు నవరస నటనా కోవిదుడు, దాదా ఫాల్కే, పద్మభూషణ పురస్కార గ్రహీత నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు. 

ఈరోజు తెల్లవారు ఝామున 2.45 కి అంతిమ శ్వాస తీసుకున్న అక్కినేని నాగేశ్వరరావు తన 91 వ సంవత్సరంలో కూడా చలాకీగా తిరుగుతూ అందరితో మాట్లాడుతూ మూడు తరాల నటులతో మనం సినిమాలో నటించారు.

ఆయన నిబద్ధతను, ప్రతివిషయంలోనూ తీసుకునే జాగ్రత్తను, ముక్కుసూటితనాన్ని, తనకు తానుగా వంటబట్టించుకున్న వేదాంతాన్ని అనుసరిస్తూ వచ్చిన విధానాన్ని, ఙాన పరిపక్వతను, ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాలనే కుతూహలాన్ని ఇలా తమ అనుభవంలో తాము చూసిన నాగేశ్వరరావు లక్షణాలను ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు వివరిస్తూ ఆయన లేని లోటును తలచుకుని చింతించారు. 

సెప్టెంబర్ 20, 1923 లో వెంకట రాఘవపురం లో జన్మించిన అక్కినేని ఒక బీద కుటుంబంలో జన్మించారు.  డ్రామాలలో స్త్రీ పాత్రలు వేసి మెప్పించిన అక్కినేని 1941లో తన 17 వ ఏట ధర్మపత్ని చిత్రం ద్వారా తెలుగు సినిమాకు పరిచయమైనారు.  ఆ తరువాత సీతారామ జననంలో రాముడిగా నటించారు.  అ తరువాత అక్కినేని అనతి కాలంలోనే హీరోగా ఎదిగి తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో మొత్తం 255 సినిమాలలో నటించారు. 

మాయాబజార్, చెంచు లక్ష్మి, అనార్కలి, బాలరాజు, మిస్సమ్మ, చక్రపాణి లాంటి చిత్రాలలో తన నటనతో మెప్పించిన అక్కినేని, తెలుగు సినిమారంగానికి చేసిన మరోసేవ సినిమా పరిశ్రమను హైద్రాబాద్ కి తీసుకునిరావటం.  దేవదాసు, ప్రేమాభిషేకం, బాటసారి, ప్రేమనగర్ లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేరు. 

దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తో కలిసి అక్కినేని సుడిగుండాలు, మరో ప్రపంచం లాంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించారు.  తనకు లభించని విద్య కొందరికైనా అందుబాటులో ఉండాలని ఆయన తపన పడేవారు. 

అక్కినేని పార్ధివ శరీరాన్ని ఆయన బంధు మిత్రులు అభిమానుల దర్శనార్ధం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉదయం 9.30 నుంచి ఉంచుతున్నారు.

అక్కినేని మృతి పట్ల ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలుగువిశేష్ కోరుకుంటోంది.

-శ్రీజ

Click here for Celebrities Pay Tribute To ANR Photos

Click here for ANR Condolences Photos

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles