Security at shamshaad airport beefed up

Security at Shamshaad Airport beefed up, Indian Mujahideen, IM Bhatkal, Central Intelligence Agency

Security at Shamshaad Airport beefed up

శంషాబాద్ విమానాశ్రయానికి విశేష భద్రతా ఏర్పాట్లు

Posted: 01/20/2014 08:53 AM IST
Security at shamshaad airport beefed up

ఇండియన్ ముజాహిదీన్ అధినేత భత్కల్ ని విడుదల చెయ్యమని కోరుతూ ఉగ్రవాద చర్యలకు దిగవచ్చన్న కేంద్ర నిఘావర్గాల నుంచి వచ్చిన హెచ్చరికల మేరకు హైద్రాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేసారు. 

జనవరి 12 నుంచే భద్రతలను పెంచిన అధికారులు ఇంకా కొనసాగిస్తూ, విఐపిల పాస్ లను కొన్నిటిని రద్దుచేసారు.  డాగ్ స్క్వాడ్. బాంబ్ స్క్వాడ్ లతో ముమ్మరంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు.

ఉగ్రవాదుల విషయంలో ఎంత చిన్న విషయం దృష్టికి వచ్చినా నిఘావర్గాలు వాటిని విస్మరించలేవు కాబట్టి ఎప్పటికప్పుడు ఆ విషయాలను సదరు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తుంటారు.  అందులో భాగంగానే గత వారం రోజులుగా ఉగ్రవాద చర్యలనుండి జాగ్రత్తలు తీసుకునే దిశగా శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతలను మరింత పటిష్టం చెయ్యటం జరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles