Pressure on mlas through sms

pressure on MLAs through SMS, Visalandhra Mahasabha, Visalandhra Secretary Srinivas, Seemandhra MLAs, Hyderabad MLAs

pressure on MLAs through SMS

ఎస్ఎమ్ఎస్ లతో ఎమ్మెల్యేల మీద సమైక్యాంధ్ర వొత్తిడి

Posted: 01/18/2014 05:11 PM IST
Pressure on mlas through sms

రాష్ట్ర పునర్విభజన బిల్లున మీద వ్యతిరేకతను చూపించటానికి హైద్రాబాద్ శాసన సభ్యుల మీద ఒత్తిడి పెంచటం కోసం విశాలాంధ్ర మహాసభ వినూత్నమైన ప్రయోగం చేస్తోంది.  హైద్రాబాద్ శాసనసభ్యులకు తెలంగాణా బిల్లుకి వ్యతిరేకంగా ఓటువేస్తేనే మేము మీకు ఓటు వేసి గెలిపిస్తామని తెలంగాణాలో స్థిరపడిన సీమాంధ్రులు ఎస్ఎమ్ఎస్ ల ద్వారా తమ కోరికను వెల్లడించవలసిందిగా విశాలాంధ్ర మహా సభ కోరింది.

విశాలాంధ్ర మహా సభ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, విడుదల చేసిన కరపత్రంలో 28 మంది శాసన సభ్యులతో పాటు హైద్రాబాద్ లో సీమాంధ్రవాసులు ఎక్కువగా ఉండే ప్రాంతంలోని ప్రజాప్రతినిధుల ఫోన్ నంబర్లను కూడా ఇచ్చామని చెప్పారు. 

దీని ద్వారా రాజకీయాలలో ఉత్సాహం చూపిస్తున్న యువత ప్రజా ప్రతినిధులకు తమ అభిమతాన్ని తెలియజేస్తూ వారి మీద ఒత్తిడిని పెంచటానికి అవకాశం ఉంటుందని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles