Private school fees nearly 50 hike

private schools, corporate schools, fee regulation, school fees,education,school,upbringing,government,government departments,privatisation

corporate schools in the city have increased fees from anywhere between 30 per cent and 50 per cent for the academic year 2014-15.

ఫీజులు బాబోయ్... స్కూలు ఫీజులు

Posted: 01/11/2014 05:34 PM IST
Private school fees nearly 50 hike

జనవరి వచ్చిందంటే చాలు... తల్లిదండ్రులలో  ఒకటే హడావుడి మొదలవుతుంది.. తమ పిల్లలను మరింత మంచి స్కూలులో జాయిన్ చేయాలని ఉవ్విళ్ళూరు తుంటారు. ఇదే అదునుగా చేసుకున్న ప్రయివేటు పాఠశాలలు విద్యార్థుల ఫీజులను మరింత రెట్టింపు చేస్తూ తల్లిదండ్రులను  హడలెత్తిస్తున్నాయి. . ఈ నేపధ్యంలో త్వరలో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం లో పలు ప్రైవేటే పాఠశాలు  ఇప్పటికీ ఫీజుల పట్టికను సిద్ధం చేస్తున్నాయి..  గత విద్యా సంవత్సరాని  కన్నా ఈసారి 30 నుండి 50 శాతం వరకు ఫీజలను రెట్టింపు చేసేందుకు  యోచనలు చేస్తున్నాయి.

అయితే ఈ విధంగా ఫీజులు పెంచడానికి  కారణం  ప్రభుత్వం తరపు నుంచి ప్రైవేటు స్కూళ్లకు  తగిన గైడ్ లైన్లు లేక పోవడమే. హైదరాబాద్ నగరంలో సుమారు  6వేల ప్రైవేటు స్కూళ్లు ఉండగా వాటిని ఫీజలు వారీగా చూసుకుంటే  మూడు కేటగిరిలలో విభజించవచ్చు. వీటిలో ముందుగా  వచ్చేవి కార్పొరేట్  స్కూళ్లు. ఈ పాఠశాలల యాజమాన్యాలు  ఏడాడికి ఫీజు కింద ఒక్కో విద్యార్థి నుంచి  లక్ష రూపాయల  వరకూ వసూలు చేస్తున్నాయి.. ఇక రెండవ కేటగిరీ కింద వచ్చే స్కూళ్లలో 45 వేల నుంచి 50 వేల రూపాయల వరకూ ఫీజల కింద వసూలు చేస్తున్నారు.

అలాగే మూడవ కేటగిరీ కిందకు  వచ్చే స్కూళ్లలో ఫీజులు 25 వేలు - 35 వేలుగా ఉన్నాయి. ఈ విధంగా ఫీజుల పెంపును తల్లి దండ్రలు వ్యతిరేకిస్తున్నారు.. స్కూళ్లలో తగిన వసతులు లేకపోయినా,  విద్యార్థుల మనో వికాసానికి దోహద పడకపోయినా   ఈ విధంగా ప్రైవేటే పాఠ శాలల యాజమాన్యాలు ఫీజుల ను పెంచడం అన్యాయమని  వారు గగ్గోలు పెడుతున్నారు.. ప్రభుత్వ  పాఠశాలల్లో తగిన విద్యా వసతులు కొరవడిన  నేపథ్యంలో  తల్లిదండ్రులు మరో గత్యంతరం లేక తమ పిల్లలను ప్రైవేలు పాఠశాలల్లో  చదివిస్తున్నారు..  దీనిని  ఆసరాగా చేసుకున్న పాఠశాల యాజమాన్యాలు  ఫీజులను ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నాయి..

అయితే విద్యాహక్కు  చట్టం తెచ్చిన ప్రభుత్వం  ఈ విషయంలో కిమ్మనకపోవడం శోచనీయం. ప్రభుత్వం 2008 వ సంవత్సరంలో జారీ చేసిన జిఓ ప్రకారం 12వేల లోపే స్కూలు పీజలు ఉండాలని  నిర్దేశించింది.. అయితే  ఇది  ఈనాటికీ అమలు కాలేదు. ఏది ఏమై నప్పటికీ  రాబోయే విద్యాసంవత్సరంలో నైనా ప్రభుత్వం  ప్రైవేటు పాఠశాలల ఫీజలు పెంపు విషయంలో కఠినంగా వ్యవహరించాలని  తల్లిదండ్రులు కోరుతున్నారు.. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles