Congress party questioning kcr on trs party merging

trs party merge congress party, state bifurcation bill 2013, ap state division and trs party, kcr and congress party, telangana issue

Congress party questioning kcr on trs party merging, trs party merge congress party, state bifurcation bill 2013, ap state division and trs party, kcr and congress party,

కేసీఆర్... విలీనం సంగతి ఏంటి ?

Posted: 12/31/2013 09:03 AM IST
Congress party questioning kcr on trs party merging

తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే టీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తానని మే..మే.. అంటూ కాంగ్రెస్ అధిష్టానం చుట్టూ తిరిగిన తెరాస అధినేత తెలంగాణ రాష్ట్ర ప్రకటన, విభజన ప్రక్రియ వేగవంతం అయినే నేపధ్యంలో ఇప్పుడు విలీనం మాటెత్తిటే మెహే..మెహే అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం విభజిస్తున్నట్లు ప్రకటించిన రోజునే విలీనం మాటేంటి అని షిండే మీడియా ముఖంగానే అడిగాడు. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ వారు విలీనం ఉండదని, కావాలంటే పొత్తు పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. ఇఫ్పుడు విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానం టీఆర్ఎస్ తో సంప్రదింపులు చేయడానికి సిద్దపడి అధిష్టానం నుండి వర్తమానం కూడా పంపినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగుతుంది లేదంటే అక్కడే ఉంటుందని కూడా హుకుం జారీ చేసినట్లు సమాచారం. అయితే కెసిఆర్ దీనిపై అందరితో సంప్రదించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలని, విలీనంపై తానొక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే పార్టీ ముఖ్యులతో మాట్లాడాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అదిష్టానం నిజంగానే కబురు చేసి ఉంటే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles