Cs meeting on state bifurcation

bifurcation bill,meeting in assembly,Nadendla Manohar,telugu desam members, cs prasanna kumar mohanty, ap govt

prasanna kumar mohanty meeting on state bifurcation.

ఇరవై రోజుల్లో అంతా సిద్దం చేయండి

Posted: 12/19/2013 11:17 AM IST
Cs meeting on state bifurcation

రాష్ట్ర విభజన బిల్లును చించేసినా, కాల్చేసినా... దాని పై నేతలు ఎన్ని మాటలు మాట్లాడినా మరో ప్రక్క దానికి సంబంధించిన ప్ర్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రంగం సిద్దం చేస్తున్నారు. ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి రాష్ట్రానికి చెందిన ఇరవై శాఖల ముఖ్య అధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించి,  విభజన బిల్లులోని అంశాలను లోతుగా పరిశీలించాలని, విభజన చేయాల్సి వస్తే బిల్లులోని అంశాల వారీగా ఆస్తులు, అప్పులతో పాటు అన్ని అంశాల్లో జిల్లాల వారీగా పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాల్సిందిగా పేర్కొన్నారు.

విభజన బిల్లులోని షెడ్యూళ్లలో ఏవైనా తప్పులు, లోపాలుంటే వాటిని గుర్తించి.. శాఖల వారీగా నోట్‌లను సిద్ధం చేయాలని మహంతి అధికారులకు సూచించారు. మొత్తం సమాచారాన్ని ఈ నెల ఇరవయ్యే తేదీలోగా అన్ని శాఖలు సమాచారం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

మరో వైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఐదు నెలలుగా తెలంగాణను ఆపుతూ వచ్చామని, ఇక మిగిలింది జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు మాత్రమేనని, ఈ రెండు నెలలు కూడా ప్రభుత్వ నిర్ణయం అమలు కాకుండా ఆపడమే కాక రాష్ట్ర విభజనను కూడా ఆపుతామని, సమై క్య రాష్ట్రంలోనే ఎన్నికలకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. ఓ వైపు అసెంబ్లీ చర్చ, మరో వైపు సీఎస్ విభనజనకు సంబంధించిన సమాచార ప్రక్రియ సేకరిస్తున్న తరుణంలో తెలంగాణ ఏర్పడితే గతంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన లగడపాటి ఆ పని చేస్తాడా ? అని తెలంగాణ వాదులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles