Cm kiran comment on telangana draft bill

cm kiran, cm kiran kumar reddy, telangana bill, cmkiran comment on t-draft bill, chief minister kiran kumar reddy, t-ministers meet cm kiran, cm n kirankumar meets digvijaysingh, telangana bill to speaker, cm kiran kumar reddy, ap state reorganization bill 2013, draft bill on telangana, telangana bill, ap assembly, ap assembly speaker , mission telangana, kiran stop telangana, telangana issue, political news, latest telugu news, breaking news, headlines

cm kiran comment on telangana draft bill

టి-బిల్లు పై సిఎం కిరణ్ కామెంట్

Posted: 12/13/2013 03:27 PM IST
Cm kiran comment on telangana draft bill

ఎట్టకేలకు తెలంగాణ బిల్లు అసెంబ్లీకి ఆఘమేఘాల మీద వచ్చింది. యుద్ద విమానంలో తెలంగాణ బిల్లును తేవటం పై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేయటం జరిగింది. అయితే చంద్రబాబుకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరిశ్ రావు కౌంటర్ వేయటం జరిగింది. తెలంగాణ బిల్లు విమానంలో రాక ఎండ్ల బండి మీద వస్తుందా? అని చంద్రబాబును ప్రశ్నించారు. అయితే తెలంగాణ బిల్లు పై రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విచిత్రమైన కామెంట్లు చేస్తున్నారు. నిన్న ఒక విలేకరు తెలంగాణ బిల్లు వస్తుందా అని ముఖ్యమంత్రిని అడిగితే.. ఆయన నవ్వుతూ.. ఏ బిల్లు .. వాటర్ బిల్లా, లేక కరెంట్ బిల్లా అంటూ వ్యంగ్యంగా ఆ విలేఖర్నీ ప్రశించారు. అయితే ఈరోజు తెలంగాణ బిల్లు పై దూకుడు పెంచారు. విభజన బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

 

ఆర్టికల్ 371(డీ) రాజ్యాంగ సవరణ అవసరమని రాష్ట్రపతి ఇచ్చిన నోట్‌లో వుందని మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో ప్రతి క్లాజ్‌పైనా శాసనసభలో ఓటింగ్, అభిప్రాయం అవసరమని పేర్కొన్నారు.విభజన బిల్లును కేంద్రం జెట్‌స్పీడులో రాష్ట్రానికి బిల్లు పంపితే, మంగళయాన్‌ స్పీడులో తిరిగి పంపిస్తామని ఆయన చమత్కరించారు.నీటి పంపకాల విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు.

 

కేంద్రంపంపిన తెలంగాణ ముసాయిదా బిల్లు ఇంగ్లీషులోఉందని, దీన్ని తెలుగులోకి అనువదించాల్సిన అవసముందని అభిప్రాయపడ్డారు.అయితే ఇప్పటికే దిగ్విజయ్ గవర్నర్ తో, తెలంగాణ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణబిల్లుపక్రియను విజయవంతంగా పూర్తి చేసుకోని పోవాలనే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా.. రాజకీయ నాయకులకు బంఫర్ ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ బిల్లు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఎలా అడ్డుకుంటాడోనని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. మంగళయాన్ స్పీడ్ తో తెలంగాణ బిల్లు పంపిస్తాడో లేక మంగళయాన్ స్పీడ్ తో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లిపోతారో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles