Ys vijayamma walked out from bac

ys vijayamma, assembly-meetings, ysvijayamma walked out from bac, telangana issue, ap bifurcation, congress party, ysrcp, speaker nadendla manohar, samaikyandhra, ysrcp walks out, seemandhra congress members, business advisory council (bac), political news, latest telugu news, breaking news, headlines,

ys vijayamma walked out from bac

ఏడు రోజులే అసెంబ్లీ-వైఎస్ విజయమ్మ వాకౌట్

Posted: 12/11/2013 07:27 PM IST
Ys vijayamma walked out from bac

రేపటి నుండి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజుల పాటే కొనసాగనున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీనితో ఈరోజు బీఏసీ భేటి అయ్యింది. అసెంబ్లీ సమావేశాల ఏజెండా ఖరారు చేసింది. ఏడు రోజులు పాటు సమావేశాలు కొనసాగనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంటే 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్నాయి. గురువారం మండేలా మృతికి శాసనసభ సంతాపం తెలుపనుంది.

 

వైఎస్ విజయమ్మ వాకౌట్ చేశారు. శాసనసభలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న తమ ప్రతిపాదనకు ప్రభుత్యం వ్యతిరేకత తెలపడంతో శాసనసభా వ్యవహారాలకమిటీ(బిఏసి) సమావేశంను తాము వాకౌట్ చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. సమావేశం ముగిసిన తరువాత విజయమ్మ మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలన్న తీర్మానం శాసనసభలో ప్రవేశపెట్టాలని తాము డిమాండ్ చేశామని చెప్పారు. తమ డిమాండ్ ను ప్రభుత్వం తిరస్కరించడంతో తాము బయటకు వచ్చినట్లు తెలిపారు.

 

విలేకరులు అడిగి ఒక ప్రశ్నకు తాము సమైక్య తీర్మానం ప్రవేశపెడతామని, ఎవరు మద్దతు తెలిపినా తాము స్వీకరిస్తామని విజయమ్మ చెప్పారు. అన్ని సమస్యలకంటే విభజనే అతిపెద్ద సమస్య అని ఆమె తెలిపారు. తుపాన్ ల నష్టాలు, కరెంట్ కష్టాలు, కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పు అంశాలపై చర్చకు కూడా డిమాండ్ చేసినట్లు వివరించారు. ప్రజాసమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విజయమ్మ తెలిపారు.

 

ఇంకా బిల్లు రాలేదు.

తెలంగాణ బిల్లు రాష్ట్రానికి రాలేదని, గురువారం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ బిల్లు రాష్ట్రానికి ఎలా చేరుతుందో తెలిపింది. మొదట రాష్ట్రపతి నుండి కేంద్ర హోం శాఖకు..అక్కడి నుండి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడి వద్దకు...ఇక్కడి నుండి ముఖ్యమంత్రి వద్దకు వెళుతుందని తెలిపింది. అనంతరం సీఎం గవర్నర్ కు వద్దకు బిల్లు పంపిస్తారని తరువాత స్పీకర్ కు టి బిల్లు చేరుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles