Rajesh talwar and nupur talwar get life sentence

Nupur Talwar, Aarushi Talwar, life sentence, Noida double murder case, Murder, Central Bureau of Investigation, Aarushi, Hemraj, Rajesh Talwar

The distraught couple were immediately taken back to the Dasna Jail in Ghaziabad district after the CBI court sentenced them to life imprisonment on charges of killing their daughter and domestic help in 2008.

ఆరుషి పేరెంట్స్ కి యావజ్జీవ శిక్ష

Posted: 11/26/2013 06:35 PM IST
Rajesh talwar and nupur talwar get life sentence

గత ఐదు సంవత్సరాల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఆరుషి, హేమరాజ్ ల జంట హత్యల కేసులో ఘజియాబాద్ సీబీఐ న్యాయస్థానం నిన్న తుది తీర్పును వెలువరించి, నేడు నిందితులకు శిక్షను ఖరారు చేసింది. ఆరుషి, హేమరాజ్ లను హత్య చేసింది దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులేనని సీబీఐ కోర్టు తేల్చింది. 2008 మే 15 రాత్రి జరిగిన ఈ జంట హత్యలను కొంత మంది సహాయంతో ఈ దంపతులే చేసి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా చేశారని సీబీఐ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు  రాజేష్ తల్వార్ కి 18 వేల రూపాయలు, నుపూర్ తల్వార్ కి రూ. 15 వేలు జరిమానా విధిస్తూ యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. దోషులుగా తేలిన రాజేష్ దంపతులకు మరణశిక్ష విధించాలని సీబీఐ వాదించింది. ఇది అత్యంత అరుదైన కేసుగా పేర్కొన్న సీబీఐ... దోషులకు మరణశిక్షే సరైందని వాదనలు వినిపించింది. అయితే శిక్ష తగ్గించాలని తల్వార్ దంపతుల తరుపు న్యాయవాది అభ్యర్థించారు.  ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు దోషులకు యావజ్జీవ శిక్ష విధించింది. కోర్టు తీర్పు విన్న ఆరుషి తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు.

కాగా తీర్పును హైకోర్టులో సవాల్ చేసేందుకు నూపూర్ తల్వార్ దంపతులు సిద్ధం అవుతున్నారు. కోర్టు వెల్లడించిన తీర్పుకు విరుద్దంగా, సీబీఐ విచారణకు వ్యతిరేకంగా ఆరుషి స్నేహితురాలు ఫిజా ఝా వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ హత్యకేసులో నిజమైన దోషులను శిక్షించినపుడే ఆరుషికి తగిన న్యాయం జరుగుతుంది అని అన్నారు. ఈ హత్యకు సంబంధించి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, పరిస్థితుల డిమాండ్ మేరకే సీబీఐ వ్యవహరించిందని ఫిజా వ్యాఖ్యలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles