No change of cm kiran

No change of CM Kiran, Kiran Kumar Reddy with Digvijaya Singh in New Delhi, Telangana Bill, ap bifurcation, samaikyandhra, telangana issue,

No change of CM Kiran, Kiran Kumar Reddy with Digvijaya Singh in New Delhi,

టీ-పై నేను మారను -నా వైఖరి మారదు : సిఎం

Posted: 11/09/2013 06:16 PM IST
No change of cm kiran

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన పై నేను మారను - నా వైఖరి మారదు అని స్పష్టంగా చెప్పటం జరిగింది. ఢిల్లీలో ఉన్న నల్లా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై తన వైఖరి ఎట్టి పరిస్థితుల్లో మారదని, విభజనకు తాను ఒప్పుకున్నాన ని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పిన మాటలు ఆయన అభిప్రాయాలేమో అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను మొదటి నుంచి సమైక్యవాదనే అని మరోసారి తేల్చిచెప్పారు.

 

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పడం తెలంగాణ ప్రజలను కించపర్చడం కాదని...ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు. విభజన వల్ల రెండు ప్రాంతాలకు నష్టం జరుగుతుందని తెలిపారు. రాబోయే సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్లాలని కేంద్రాన్ని కోరుతున్నామని కిరణ్ అన్నారు.

 

విభజన జరిగితే ఉద్యోగులకు పెద్ద సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. ఆర్టికల్ 371(డి), విద్య, ఉద్యోగ అవకాశాలు, హైదరాబాద్ వంటి అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని సీఎం కిరణ్ తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles