నరేంద్ర మోదీ పేరుని ప్రధాని అభ్యర్థిగా భాజపా ఖరారు చెయ్యగానే రాజకీయ వర్గాల్లో ప్రకంపనం బయలుదేరిందని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కంపించిపోతోందని భాజపా సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు మీడియా ప్రతినిధులతో అన్నారు. దానితో నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ అర్థంపర్థం లేని వ్యాఖ్యలను చేస్తోందని కూడా ఆయన అన్నారు.
మోదీ గెలిస్తే ప్రజాస్వామ్యం అంతరించిపోయినట్లేనని ఒక రాజకీయ నాయకుడు వ్యాఖ్యనించారని, అసలు ప్రజాస్వామ్యాన్నే నాశనం చేసిన పార్టీ ప్రజాస్వామ్యం ప్రస్తావన తీసుకురావటం తగునా అని ఆయన ప్రశ్నించారు.
ఆర్ఎస్ఎస్ వత్తిడితో నరేంద్ర మోదీకి భాజపా ప్రాముఖ్యతను కల్పించిందన్న వ్యాఖ్య పూర్తిగా అబద్ధమని అన్నారాయన. హిందుత్వానికి, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదన్నారాయన.
ఇంకా, సీనియర్ నేత అద్వానీ గురించి మాట్లాడుతూ, ఆయన గురించి వ్యాఖ్యానించటం తగదని, ఆయన పార్టీకి ఎంతో సేవచేసారని, ఆయన దృష్టి కోణం ఆయనకుంటుందని అన్న వెంకయ్యనాయుడు అద్వానీ మోదీ అభ్యర్థిత్వాన్ని ఎంత మాత్రం వ్యతిరేకించలేదని, శాసన సభ ఎన్నికల తర్వాత ఆ పని చెయ్యవచ్చు కదా ఇంత ముందే ఎందుకన్నది మాత్రమే ఆయన ఉద్దేశ్యమని అన్నారు.
వెంకయ్యనాయుడు పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడుతూ, ఎన్నో రాజకీయ పార్టీలు తమ పార్టీతో కలవటానికి ఉత్సుకతను చూపిస్తున్నాయని, రాజకీయ మద్దతులలో చాలా మార్పులు రాబోతున్నాయని చెప్పిన వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, బహుశా సమయానికి ముందుగానే ఎన్నికల ప్రకటన జరగవచ్చని, అయితే ఆ పార్టీ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రాబల్యాన్ని కోల్పోబోతోందని ఆయన జోస్యం చెప్పారు.
--శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more