Oppn demands resignation from akhilesh govt

Muzaffarnagar clashes,Akhilesh Yadav,Mulayam Singh Yadav,Manmohan Singh, Muzaffarnagar violence,26 People died

Samajwadi Party chief Mulayam Singh Yadav today held a meeting with chief minster Akhilesh Yadav and senior officers to take stock of the situation.

అదుపులోకి రానిపరిస్థితులు - రాష్ట్రపతి పాలనా ?

Posted: 09/09/2013 04:47 PM IST
Oppn demands resignation from akhilesh govt

ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో గత రెండు రోజుల నుండి జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి మత ఘర్షణలు, అల్లర్లలో దాదాపు 26 మందికి పైగా మరణించారు. ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం భారీగా బలగాలు మోహరించింది. అయినా అల్లర్లు అదుపులోకి రావడం లేదు. జిల్లాలోని సివిల్ లైన్స్, కొత్వాలి, నైనీ మండి ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసు, పీఏసీ బలగాలు కవాతు చేశాయి. యూపీలో హింసా కాండను నియంత్రించడంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రపతి పాలన విదించాలని ఆర్ఎల్‌డీ, బీఎస్‌పీ పార్టీలు సోమవారం డిమాండ్ చేశారు. రిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ నుంచి ముజఫర్‌నగర్ వెళ్తున్న కేంద్రమంత్రి అజిత్‌సింగ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles