Konda couples re join in congress party and cm kiran

konda couples Re join in congress party and cm kiran, Konda Surekha Re Join In Congress, r MLA KK Mahender, Konda Surekha To Join Congress, ys jagan, konda surekha, konda murali , cm kiran

konda couples Re join in congress party and cm kiran, Konda Surekha Re Join In Congress

జగన్ మీద కోపం - పుట్టింటికి వెళ్లిన కొండా సురేఖ

Posted: 09/04/2013 09:50 PM IST
Konda couples re join in congress party and cm kiran

వైఎస్ జగన్ మీద కోసం మాజీ మంత్రి కొండా సురేఖ పుట్టింటికి వెళ్లిపోయారు. కొండా దంపతులు ఈరోజు సాయంత్రం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరారు. వారితో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన కెకె మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెసు పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని దిగ్విజయ్ సింగ్ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు తీసుకున్న వైఖరిని కొండా సురేఖతో పాటు కెకె మహేందర్ రెడ్డి తప్పు పట్టారు. కాంగ్రెసు పార్టీ తమ పుట్టిల్లని, మరింత మంది కాంగ్రెసులో చేరుతారని కొండా సురేఖ అన్నారు. సమన్యాయంతో పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్య రాగం అందుకోవడం వల్లనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు ఆమె తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు, తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు తాము కాంగ్రెసులో చేరినట్లు తెలిపారు. రాష్ట్ర విభజనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యూటర్న్‌ను ఆమోదించలేమని, తమకు నష్టం జరిగినందు వల్లనే తాము బయటకు వచ్చామని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి తన ప్రాంత ప్రజల మనోభావాలు వెల్లడిస్తున్నారని, అందులో తప్పేమీలేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles