Minister pardhasaradhi asked to step down

Minister Pardhasaradhi, Chiranjeevi, J D Sheelam, K Sambasiva Rao, Samaikyandhra movement, Panabaka Lakshmi

minister pardhasaradhi asked to step down by protesters

గద్దె వదలండి, రాష్ట్రాన్ని కాపాడండి

Posted: 08/07/2013 05:04 PM IST
Minister pardhasaradhi asked to step down

మంత్రి కె.పార్థసారధి ఇంటిని ముట్టడించిన ప్రభుత్వోద్యోగుల్లో మగ వాళ్ళు నడుం పైన దుస్తులను తీసేసి మోకాళ్ళ మీద కూర్చుని మంత్రిని రాజీనామా చెయ్యమని అర్థించారు. 

పార్థసారధి ఇంటి చుట్టూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, నిరసనలు తెలియజేయటానికి లోపలికి పోవటానికి భద్రతా సిబ్బంది నిరాకరణ తెలియజేయటంతో బయటే తమ నిరసనను ప్రదర్శించారు. 

అయ్యా దయచేసి రాజీనామా చెయ్యండి మిమ్మల్ని వేడుకుంటున్నాం అంటూ ఉద్యమకారులు మంత్రిని ప్రార్థించారు. 

మహిళా ఉద్యోగులు భారత పతాకంలోని మూడు రంగులలో మంత్రికి సమర్పించటానికి గాజులు తీసుకునివచ్చారు.  పూర్వకాలం నుంచీ వస్తున్న మాట చేతకాని మగవాళ్ళను గాజులు వేసుకోమని చెప్పటం.  అయితే మహిళలు కూడా మగవారితో సమానంగా ఉద్యోగాలలో రాణిస్తున్నా, ఇంకా అలా గాజులు ఇచ్చే సాంప్రదాయం పోలేదు.

గాజులు, పసుపు, కుంకుమ, వక్కపొడి పెట్టిన ప్లేటుని పట్టుకుని మహిళా ఉద్యోగులు మంత్రి పార్థసారధి ఇంటిముందు రాజీనామాలు చెయ్యని కేంద్ర మంత్రులందరూ ఇప్పటికైనా రాజీనామాలను సమర్పించాలని నినాదాలు చేస్తూ నిరసనలు ప్రదర్శించారు. 

ఉద్యమకారులు రాజీనామాలను కోరిన సీమాంధ్ర నేతలలో పార్థసారధితోపాటు, చిరంజీవి, కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, జె.డి.శీలం, ఎమ్ఎమ్ పళ్ళం రాజు ఉన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles