Aged voters died in panchayat elections

Aged voters died in elections, Panchayat elections 2nd phase, Panchayat elections in AP, aged persons died at polling stations

aged voters died in panchayat elections

ఓటు వెయ్యటానికి వెళ్ళి ప్రాణాలను వదిలిన ఉదంతాలు

Posted: 07/27/2013 12:46 PM IST
Aged voters died in panchayat elections

రాష్ట్రంలో ఈరోజు రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేసి మరణం పాలయ్యారు. 

నేలకొండపల్లి మండలం బోదుల కొండలో ఓటు హక్కుని వినియోగించుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక వృద్ధురాలు మృతి చెందింది.  నల్గొండ జిల్లాలోని కనగల్ లో కూడా ఓటు వేసి బయటకు వస్తూ ఒక వృద్ధురాలు మృతి చెందటం జరిగింది. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం మీర్జాపూర్ లో 60 సంవత్సరాల రావమ్మ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళి కిందపడి మరణించటం జరిగింది. 

కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేయటానికి పోయి వెయ్యకుండానే మరణం పాలయ్యారు. 

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లింగన్నపేటలో గోపయ్య పేరుగల వృద్ధుని మరణం సంభవించింది.  కడప జిల్లాలో సిద్ధవటం మండలం మూలపల్లెలో ఓటు వెయ్యటానికి వెళ్ళి ఒక వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు.  పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయ గూడెం మండలం గణపవరంలో ఓటు వెయ్యటానికి వెళ్ళిన 80 సంవత్సరాల వృద్ధుడు మరణించటం జరిగింది. 

ఎన్నికలలో గెలవటం కోసం రాజకీయ నాయకులు చేసిన ఒత్తిడికి ఓటు హక్కుని వినియోగించుకోవటానికి వెళ్ళిన వృద్ధులు అక్కడ ఎక్కువ సేపు క్యూలలో నిలబడవలసి రావటంతో కొన్ని చోట్ల ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు అంటున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles