Nursing student gangraped in kurnool

Nursing student gangraped in Kurnool, Gangrape in Kurnool, Brindavan Engineering College Kurnool, Nursing college Kurnool

nursing student gangraped in Kurnool

వైద్య విద్యార్థిని మీద సామూహిక అత్యాచారం

Posted: 07/19/2013 02:42 PM IST
Nursing student gangraped in kurnool

సామూహిక అత్యాచారం తర్వాత బాధితురాలు కర్నూల్ నగర శివార్లలో స్పృహలేని స్థితిలో పోలీసులకు కనిపించగా ఆమెను పోలీసులు కర్నూల్ జనరల్ హాస్పిటల్ కి తరలించారు.

20 సంవత్సరాల నర్సింగ్ విద్యార్థిని మీద కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.  అ అమ్మాయి ప్రకాశం జిల్లా దార్శి కి చెందినట్లుగానూ, కర్నూల్ లో నంద్యాల రోడ్ లో ఉన్న నర్సింగ్ కాలేజ్ లో చదువుకున్నట్లుగానూ పోలీసులు తెలియజేసారు. 

ఫెయిలైన సబ్జెక్ట్ లలో పరీక్షకు తిరిగి హాజరవటం కోసం ఫారం ఫిలప్ చెయ్యటానకి కర్నూల్ వచ్చిన ఆ అమ్మాయి ఆ పని అయిపోయన తర్వాత నిన్న రాత్రి 10 గంటలకు తిరిగి తన గ్రామానికి పోవటానికి ఎక్కిన ఆటోని దారి తప్పించి ఆటో డ్రైవర్ ఆమెను పెద్దటేకూరు తీసుకెళ్ళారు.  బృందావన్ ఇంజినీరింగ్ కాలేజ్ దగ్గర మరో ముగ్గురు ఆ ఆటో డ్రైవర్ తో చేరారు.  ఆ తర్వాత వాళ్ళు సామూహికంగా ఆమెను అత్యాచారానికి గురిచేసి స్పృహతప్పిపోయిన తర్వాత ఆమెను అక్కడ తుప్పలలో వదిలేసిపోయారు. 

పోలీసులు చూసినప్పుడు ఆ తుప్పలలో ఆమె దుస్తులు చెల్లా చెదరుగా పడేసివున్నాయి.  ఆమె స్పృహతప్పిన పరిస్థితిలో దాదాపు 5 గంటలసేపు అక్కడే పడివుందని తెలిసింది. 

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  నేరస్తులను పట్టుకోవటానికి ఆధారాల కోసం పోలీసులు వెదుకుతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles