Nimmagadda prasad gets 13 day interim bail by cbi special court

nimmagadda prasad gets conditional bail, nimmagadda prasad, cbi special court, nimmagadda prasad gets 13-day interim bail, chanchalguda jail on bail, popular industrialist nimmagadda prasad,

Nimmagadda Prasad gets 13-day interim bail by CBI Special Court

మామ కోసం పగలు బయట- అతని కోసం రాత్రికి జైలు!

Posted: 07/11/2013 07:33 PM IST
Nimmagadda prasad gets 13 day interim bail by cbi special court

జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, మాట్రిక్స్ సంస్థ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ కు బెయిల్ లభించింది. అయితే పగలు మాత్రం బెయిల్ ఇస్తూ కొత్త తరహా ఉత్తర్వును కోర్టు ఇచ్చింది. ప్రసాద్ మామ చనిపోయినందున, అంత్యక్రియలు, ఇతర విధులు నిర్వర్తించడం కోసం మద్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన దరఖాస్తును పరిశీలించిన కోర్ట్ ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. సీబీఐ న్యాయస్థానం నిమ్మగడ్డకు 13 రోజులపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు నేడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు షరతుల ప్రకారం బెయిల్, ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలవరకే వర్తిస్తుంది. కాగా, బెయిల్ వ్యవధిలో నిమ్మగడ్డ కేవలం కుటుంబసభ్యులతో సంభాషించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇంకే ఇతర వ్యక్తులతోనూ కలిసి మాట్లాడ కూడదని కోర్టు గట్టి షరతులను విధించింది. మొత్తానికి ఏదోలా ప్రసాద్ చాలా రోజుల తర్వాత బెయిల్ పై బయటకు వస్తున్నారు. ఇలా 13 రోజులపాటు బెయిల్ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles