కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి అనేక పదవులు అనుభవించిన కే.కేశవరావు తెలంగాణ సెంటిమెంటుతో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేశవరావుకు ఆ పార్టీలో పెద్దపీటే వేస్తున్నారు. కె.కేశవరావును పార్టీ సెక్రటరీ జనరల్‌గా, జాతీయ వ్యవహారాల సమన్వయ కమిటీ చైర్మన్‌గా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల సమక్షంలో నియమించారు. ఈ సందర్భంగా కేకేను తనకు కేటాయించిన ప్రత్యేకమైన ఛాంబర్లోని సీట్లో కేసీఆర్ స్వయంగా కూర్చోబెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ "నా కుడి పక్కన కేకే, ఎడమ వైపు కడియం ఉన్నారు. మేం భిన్నమైన పార్టీల్లో ఉండేవాళ్లం. భిన్నమైన దృక్పథాలు కలిగి ఉన్న వాళ్లం. తెలంగాణ అనే ఒక్క అంశం మమ్మల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది'' అని కేసీఆర్ చెప్పారు. కేకేకు పదవి ఇచ్చేంత పెద్దవాడిని కాదని, ఆయనకున్న శక్తి సామర్థ్యాలు తనకు లేవని చెప్పారు. కేకేకు తాను పెద్ద అభిమానిని అని కేకే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికై కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నప్పుడు నేను ఎంఎ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్‌గా ఉండేవాడిని. ఆయన కౌన్సిల్‌లో చేసే ప్రసంగాలు వినాలని ఆరాటపడేవాడిని. ఎలాగోలా పాస్ సంపాదించుకొని కౌన్సిల్ గ్యాలరీలో కూర్చొని ఆయన స్పీచ్ వినేవాడిని అని చెప్పారు. ఆయన పార్టీ జాతీయ వ్యవహారాల సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఉండటం తమకెంతో లాభం కలిగిస్తుందన్నారు. పార్టీలో అన్ని విషయాలలో కె.కేశవరావు కలగచేసుకుని పనిచేయాలని కోరుతున్నా నిని చంద్రశేఖరరావు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more