Telangana news medak mp vijayashanti comment on bjp party

vijayashanti, medak mp vijayashanti, trs party, bjp party, mp seat win in secundrabad, cm kiran kumar reddy, ysr, congress party, mla nagam janardhana reddy, kcr, tdp, bjp

medak mp vijayashanti comment on bjp party

కేసిఆర్ చెల్లెలు జోష్యం

Posted: 06/04/2013 11:08 AM IST
Telangana news medak mp vijayashanti comment on bjp party

నిన్నటి వరకు బిజేపి నాయకులతో మంతనాలు, రహస్య చర్చలు జరిపి, విఫలం కావటంతో ఇప్పుడు బిజేపి పార్టీకి జోష్యం చెబుతుంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో రాములమ్మ పేరు బాగా వినిపిస్తుంది. ఆ పార్టీలో ఉంటూనే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో మంతనాలు జరుపుతున్నారనే విమర్శలు వచ్చాయి. గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కూడా రాములమ్మ ( విజయశాంతి) మంతనాలు జరిపినట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీలోకి ఎమ్మెల్యేనాగం జనార్థన్ రెడ్డి వెళ్లటం పై రామలమ్మ మండిపడుతున్నారు. బిజేపీ ఒక్క సికింద్రాబాద్ లోకసభ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంటుందని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. ఆ ఒక్క సీటు మినహా తెలంగాణలో మరెక్కడా బిజెపి గెలువదన్నారు. ఆ విషయాన్ని తెలుసుకొని మసులుకోవాలని హితవు పలికారు. తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా 13 ఏళ్ల క్రితం తెరాస ఆవిర్భవించినందువల్లనే నాగంతో పాటు టిడిపి, కాంగ్రెస్, బిజెపిలు ప్రత్యేక రాష్ట్ర జపం చేస్తున్నాయని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles