Armoor trs mla candidate jeevan reddy

k chandrasekhar rao, jeevan reddy, telangana, armoor, nizamabad

Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao has announced Jeevan Reddy is Armoor TRS MLA candidate.

ఆర్మూర్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన

Posted: 05/13/2013 06:15 PM IST
Armoor trs mla candidate jeevan reddy

2014 ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నాయకులను తమ తమ పార్టీల్లోకి లాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులను అప్పుడే సీట్లను ఖరారు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి అయిన జీవన్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనను ఆర్మూర్ శాసనసభా అభ్యర్థిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల వరకు ఆర్మూర్ నియోజక వర్గ ఇంఛార్జిగా నియమించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్మూర్ లో తెలంగాణ వచ్చిన తరువాత పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఇక ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వం అని, మాటల ప్రభుత్వం కాదని అన్నారు. ఇక రైతు ప్రభుత్వం అని చెప్పుకొని అర్హత కాంగ్రెస్ కే ఉంటుందని, తెలుగు దేశానికి ఉండదని, చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చెప్పారా అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles