Political speaker meira kumar statue of two dalit leaders installed in tirupati

speaker meira kumar statue of two dalit leaders installed in tirupati, tirupati, meira kumar, dalit leader statues, babu jagjivan ram, damodaram sanjeevaiah, dalit oppression

speaker meira kumar statue of two dalit leaders installed in tirupati

నాన్నగా కాదు.. నేతగానే గౌరవిస్తా

Posted: 04/29/2013 10:06 AM IST
Political speaker meira kumar statue of two dalit leaders installed in tirupati

తన తండ్రిగారైన జగ్జీవన్‌రామ్‌ను తండ్రిగా కాక రాజకీయ నాయకుడిగా తానెంతో గౌరవిస్తానని లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ అన్నారు. నగరంలోని కేశవాయనగుంటవద్ద ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ కాంస్య విగ్రహాన్ని, తిరుచానూరు రోడ్‌లోని అర్బన్‌ హాట్‌ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో హాజరైన మహిళలనుద్దేశించి లోక్‌సభ స్పీకర్‌ ప్రసంగించారు. తన తండ్రి విగ్రహాన్ని తన చేతులమీదుగా పుణ్యక్షేత్రమైన తిరుమల సమీపంలో ఆవిష్కరించడం ఎంతో హర్షదాయకమన్నారు. గొప్ప దళిత జాతీయ నాయకులైన బాబు జగజ్జీవన్‌రామ్‌, దామోదరం సంజీవయ్యల విగ్రహాలను తన చేతులమీదుగా ఆవిష్కరించడం ఆనందదాయకమన్నారు. వారు దేశానికి, దీన జనోద్ధరణకు చేసిన సేవలు చిరస్మర ణీయమన్నారు. వారు ఇరువురు కూడా బడుగుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా తన తండ్రి బాబు జగ్జీవన్‌రామ్‌ అప్పుడు తీసుకున్న చర్యలవ ల్లే ఇప్పుడు సమృద్ధిగా ఆహార ధాన్యాలు దేశంలో వున్నాయన్నారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్‌ విజయఢంకా మోగించడంలో రక్షణశాఖ మంత్రిగా బాబుజగ్జీవన్‌రామ్‌ కీలకపాత్ర పోషించారన్నారు. ఇంతటి ఘన చరిత్ర కేంద్ర మంత్రిగా వుండగా జవహర్‌లాల్‌ తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా దళితుణ్ణి ఎన్నుకున్న ఘన చరిత్ర ఆంధ్ర రాష్ట్రానికుందన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles