Gali muddukrishnama naidu objects for govt negligence on tirumala

fire at tirumala, gali muddu krishnama naidu, telugu desam party, ys raja sekhara reddy, kiran kurma reddy

gali muddukrishnama naidu objects for govt negligence on tirumala

తిరుమల మీద నిర్లక్ష్యం కూడదు !

Posted: 04/18/2013 04:56 PM IST
Gali muddukrishnama naidu objects for govt negligence on tirumala

 తిరుమలలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల ఆగ్రహం వహించిన తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. రోజుకు ముప్పైవేల మందికి అన్నదానం జరిగే తిరుమల అన్నదాన సత్రంలో నిర్లక్షమా, అన్నదాన పథకంలో 24 గంటలు పనిచేసే అధికారులను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. తిరుమలలో అగ్ని ప్రమాదం జరగటం ఇది మొదటి సారి కాదు. అయినా తిరుమల యాజమాన్యం అవసరమైన భద్రతా చర్యలను తీసుకోవటం లేదని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన అన్నారు.

తిరుమల మీద ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకోవటానికి తిరుమల ఈవో గా నియమించిన అవినీతి పరుడైన అధికారి విషయమే చాలన్నారు గాలి.

తిరుమలలో అవినీతి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ విషయాన్ని ఏఈవో ఫిర్యాదు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటంలేదంటూ ఆయన ప్రశ్నించారు. వైయస్ పాలనలో సరే, ఆయనకు దేవుడిమీద నమ్మకం లేదు, మరి దేవుడి మీద భక్తి విశ్వాసాలున్నకిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు పట్టించుకోవటం లేదు అని కూడా ఆయన ప్రశ్నించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles