10 maoists killed in police encounter

andhra chattisgarh border, chintalanar, greyhounds, khammam sp, bhadrachalam, 10 maoists killed, kankanala rajireddy

10 maoists killed in police encounter

ఆంధ్రా-ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో ఎదురుకాల్పులు

Posted: 04/16/2013 03:41 PM IST
10 maoists killed in police encounter

ఆంధ్రా-ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో చింతలనార్ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్ట్ లకు మధ్య కాల్పులు జరిగాయి.  ఖమ్మం జిల్లాకు 15 కిలో మీటర్ల దూరంలో జరిగిన ఈ సంఘటనలో 10 మంది మావోయిస్ట్ లు మరణించారు, పలువురు గాయపడ్డారు. 

150 మందితో మావోయిస్ట్ లు సమావేశమౌతున్నారని సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్, సిఆర్ పి ఎఫ్, ఖమ్మం జిల్లా పోలీసులు విడివిడిగా తనిఖీలు జరుపుతుండగా మావోయిస్ట్ లు ఎదురుపడటంతో కాల్పులు, ఎదురు కాల్పులు జరిగాయి.  మావోయిస్ట్ లు 9 మంది మరణించి, కొందరు గాయపడగా, మరికొందరు పారిపోయారు.  పోలీసులకు భారీగా వాళ్ళ ఆయుధాలు దొరికాయి.  ఎన్ కౌంటర్ లో మరణించినవారిలో కరీం నగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన కంకణాల రాజిరెడ్డి ఉన్నారు. 

సమాచారం అందగానే వెంటనే ఘటనా స్థలికి హెలికాప్టర్ లో బయలుదేరిన ఖమ్మం జిల్లా ఎస్ పి ఎ.బి.రంగనాధ్ గాయపడినవారికోసం తనతో పాటు ఆహారాన్ని తీసుకెళ్ళారు.  మృతి చెందిన మావోయిస్ట్ ల మృతదేహాలను హెలికాప్టర్లలో భద్రాచలం తరలించటానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఖమ్మం ఆయన తెలియజేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles