2g scam raja wants to appear as witness before the jpc

2g scam, a raja, telecom minister, jpc, ge vahanvati, cbi

2g scam: raja wants to appear as witness before the jpc.Blamed for a number of issues in the 2G scam, former Telecom Minister A Raja wants to appear before the Joint Parliamentary Committee (JPC) as a witness to tell his side of story.

raja.gif

Posted: 02/24/2013 11:31 AM IST
2g scam raja wants to appear as witness before the jpc

2g scam: raja wants to appear as witness before the jpc

2జి స్పెక్ట్రమ్ లైసెన్స్‌ల కేటాయింపులో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతున్న పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సంఘం ఎదుట తన వాదన వినిపించుకునే అవకాశం కల్పించాలంటూ మాజీ మంత్రి ఎ.రాజా లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయటంతో వ్యవహారం సరికొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన డిఎంకేకి చెందిన రాజా లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను కలిసి ఈమేరకు లేఖ అందించారు. అయితే రాజాను పిలిచి సాక్ష్యం తీసుకోవాల్సిందిగా జెపిసిని కోరే అధికారం స్పీకర్‌కు లేనందున, ఆమే ఈ లేఖను కమిటీ చైర్మన్ పిసి చాకోకు పంపుతారని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఖజానాకి 1.7లక్షల కోట్లమేర నష్టం కలిగించే విధంగా లైసెన్స్‌ల కేటాయింపు జరిగినట్టు కాగ్ ధృవీకరించిన విషయం విధితమే. చివరకు సుప్రీమ్ కోర్టు ఆదేశం మేరకు సిబిఐ విచారణ చేపట్టిన తరువాత రాజాకు జైలు శిక్ష పడింది. రాజా జైలునుంచి బయటకు రాకముందు నుంచే ఇటు ప్రభుత్వం, అటు కాంగ్రెస్ కాగ్ అందించిన నివేదికను తప్పుల తడకగా అభివర్ణించాయి. చివరకు ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కాగ్ నిర్థారణకు ప్రామాణికత లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలకు లోబడే లైసెన్స్‌ల కేటాయింపు జరిగిందని రాజా వాదించగా, ఒక్క పైసా నష్టం కలగలేదని మంత్రి కపిల్ సిబల్ కాగ్‌పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో కాగ్ నివేదికలోని తప్పులను ఎత్తిచూపుతూ తన వాదనను జెపిసి రికార్డు చేయాలని కోరుతూ రాజా చాలాసార్లు అభ్యర్థించారు. కాగ్ నివేదిక మాదిరి జెపిసి నివేదిక ఏకపక్షంగా ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే తనకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా రాజా జెపిసిని కోరినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana ministers mps meet ghulam nabi azad
Maldives ex president nasheed left indian mission  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles