Riyaz hand hyderabad blasts

riyaz bhatkal, blasts, hyderabad, dilsukhnagar, hyderabad blasts, dilsukhnagar blasts

Blasts have taken place at Dilsukhnagar in Hyderabad opposite bus depot. It is said that 22 persons have succumbed to the injuries

riyaz hand hyderabad blasts.png

Posted: 02/22/2013 09:46 AM IST
Riyaz hand hyderabad blasts

riyazరాష్ట్రరాజధాని హైదరాబాద్ లో నిన్న సాయంత్రం జరిగిన జంట బాంబు పేళుళ్ళ ఘటన వెనుక ఉగ్రవాద హస్తం ఉన్నట్లు ఇంటలీజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ సంఘటన వెనుక ఉద్రవాది రియాజ్ భత్కల్ ఉన్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బెంగళూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల అనంతరం సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు 2012 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో దర్యాప్తు జరిపి 25 మందిపై కేసులు నమోదు చేశారు. ఎన్ఐఏకు ఇంకా దొరకనివారిలో కరడుగట్టిన ఉగ్రవాది, కర్ణాటకకు చెందిన రియాజ్ భత్కల్ కూడా ఉన్నాడు. హైదరాబాద్ పేలుళ్ల వెనుక ప్రణాళిక రియాజ్‌దేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చార్జిషీట్ దాఖలైన 12 మంది ఉగ్రవాదులు లష్కరేతాయిబా, హుజి సంస్థలకు చెందినవారు. ఎన్ఐఏ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న రియాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రియాజ్ భత్కల్.. అలియాస్ షా రియాజ్ అహ్మద్ మహమ్మద్ ఇస్మాయిల్ షహ్మందారి కర్ణాటకలోని మంగళూరు జిల్లా భత్కల్‌లో 1976లో జన్మించాడు.  రియాజ్ నిషేధిత 'సిమి' సంస్థలో కొంతకాలం పనిచేసి.. ఆ తర్వాత దుబాయ్‌కు వెళ్లి, అక్కడినుంచి పాకిస్థాన్‌కు చేరాడు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో చేరి.. అగ్రస్థాయికి ఎదిగాడు. భారత్‌లో పలు నగరాల్లో జరిగిన బాంబు పేలుళ్లకు ప్రణాళికలు రచించింది రియాజేనని చెబుతారు. 2010లో పుణెలో జరిగిన జర్మన్ బేకరీ పేలుళ్లు, 2011లో జరిగిన ముంబై పేలుళ్లలో రియాజ్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సమాచారం. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లలో రియాజ్ నేరుగా పాల్గొన్నాడా లేక అతని అనుచరులు ఆపరేషన్‌లో పాల్గొన్నారా అనేది విచారణలో తేలాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Internal war a bonus to terrorist
Number of dead in hyderabad blasts reached 16  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles