భూగోళం ఎంత ఉన్నా సరిపోదు. ఎంత భూమి మీద నా సొంతం అని గిరిగీసుకున్నా తృప్తి ఉండదు. భూమిని కైవసం చేసుకోవటానికి ఉన్న మార్గాలలో దౌర్జన్యానిది ఎప్పుడూ పైచేయే. కాకపోతే అది భూకబ్జా నేరం కింద ఎప్పుడో ఒకప్పుడు చట్టం పరిధిలోకి రాకమానదు. కానీ అలా వచ్చినా, కబ్జాదారులూ కొన్ని ఆధారాలను చూపించి, కేసుని ఎటూ తేలకుండా చేసి అది కొన్నాళ్ళపాటు కోర్టు నిర్ణయం వచ్చేంతవరకూ ఎవరికీ చెందకుండా చేసే అవకాశమూ ఉంది.
ఇక రెండవ మార్గం ఆధ్యాత్మిక, మత పరమైన కట్టడాలతో, దాన్ని లాక్కోవడం. ఒక గుడి కట్టి కాని, లేదా ప్రార్థనా మందిరాలను నిర్మించి కానీ, లేక నిర్మించటానికి కాని భూమిని వశపరచుకోవటం. రహదారిలో అడ్డుగా ఉన్న కట్టడాలను తొలగించగలిగిన ప్రభుత్వం మతపరమైన వివాదాలు చెలరేగకూడదనే ఉద్దేశ్యంతో ఆధ్యాత్మిక కేంద్రాల జోలికి పోదు. రోడ్డు వెడల్పయిన తర్వాత అలాంటి కట్టడాలు కొట్టొచ్చినట్టుగా కనపడతాయి.
క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ మీద మణికొండ దరి జాగిర్ కంచె, పొక్కులవాడలలో భూకబ్జా కేసులున్నాయి. సదరు భూమి తాలూకూ బాధితుడు యాదయ్య తనను బ్రదర్ అనిల్ మనుషులు వేధిస్తున్నారని వాపోతున్నారు. అయితే తెలంగాణాకు చెందిన క్రైస్తవ సంఘం అతనికి మద్దతు పలుకుతూ, అనిల్ ని మతం నుంచి బహిష్కరించటానికి సిద్ధమని తెలియజేసింది.
కొన్ని రోజుల క్రితం మహబూబ్ నగర్ కడ్తాల్ లో ధ్యానగురు సుభాష్ పత్రి ఆధ్వర్యలో ధ్యానకేంద్రంవారు నిర్మించిన పిరమిడ్ మీద కూడా ఇలాంటి వార్తలే వినవచ్చాయి. సేవా తర్పరతో పనిచేస్తున్నామని చెప్తున్న సంస్థలు పౌరులను ఎవరినీ బాధించకుండా పనిచేస్తేనే హర్షనీయం. పదిమందికీ ఉపయోగపడుతుందని చేసే పనులలో ఏ ఒక్కరినీ ఇబ్బందిపెట్టకుండా ఉంటేనే ఆయా సంస్థలపట్ల సద్భావన కలుగుతుంది.
హిందూ అవతారాలన్నీ భూమ్మీద ధర్మాన్నినెలకొల్పి శాంతిని కలుగజేయటానికి ఉద్భవించినవే. అన్ని మతాల ప్రవక్తలూ శాంతికాములే, శాంతిని ప్రభోదించినవారే. అందులో ముఖ్యంగా వరాహావతారం మునిగిపోతున్న భూదేవిని రక్షించటానికి ప్రకటితమైనదే. అటువంటి దేవుళ్ళ పేరుతో భూమిని లాక్కోవటం శోచనీయం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more