Governor k rosaiah attending the world telugu internet meet

tamilnadu governor k rosaiah, rosaiah attending world telugu internet meet,ex chief minister k rosaiah,world telugu internet meet on nov2, Gitam University, ,second international Telugu Internet Convention, K Rosaiah would inaugurate the conference, GITAM University in Visakhapatnam, SiliconAndhra,k rosaiah talks telugu language rosaiah fight telugu language,

governor k rosaiah attending the world telugu internet meet

rosaiah.gif

Posted: 11/02/2012 05:36 PM IST
Governor k rosaiah attending the world telugu internet meet

governor k rosaiah attend the world telugu internet meet

మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర గవర్నర్  కె.రోశయ్య  తెలుగు భాష పై మరింత మక్కువ చూపుతున్నారు. ఆయన తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పటికి తెలుగు భాషను  అభివ్రుద్ది చేయాలని ఆయన ఆరాట పడుతున్నారు.  తెలగు భాషోద్యమం మరింత  బలపడాలని   కే. రోశయ్య కోరుకుంటున్నారు.  గీతం విశ్వవిద్యాలయంలో జరిగిన  రెండో  అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సును  ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.  ఆంద్రప్రదేశ్ లో  తెలుగు భాషోద్యమం  ప్రస్తుతానికి  ఒకింత వెనుక బడి ఉందని  ఆయన అన్నారు.  భాషను మరింత అభివ్రుద్ది  చేయాలన్న  తలంపుతో  సిలికానాంధ్ర  సంస్థ, ఆంధ్రప్రదేశ్  సమాచార సాంకేతిక  శాఖ సంయుక్తంగా  పని చేయటం  హర్షించదగ్గ పరిణమా మన్నారు.  తెలుగు భాషపై  మరింత  మక్కువ పెరిగే  విధంగా  ప్రజల్లో  అవగాహన  పెంపొందించాలన్నారు.  తాము చదువుకొనే రోజుల్లో  పెద్దబాలశిక్ష  విద్యార్థుల వికాసానికి  ఎంతగానో దోహదపడేదని , ఇప్పటి తరం పిల్లల్లో  చాలా మందికి ఆ పుస్తకం పేరే తెలియదని కే. రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు.  అమ్మా, నాన్న అంటే ఆగ్రహించే  తల్లిదండ్రులున్నారని  మమ్మీ, డాడీల  పద్దతి వారికి  ముద్దు అయిపోయిందని ఆయన వాపోయారు.  తాను  యుక్త వయసు నుంచే పంచకట్టుతో తిరిగేవాడినని, విదేశాలకు వెళ్లినప్పుడు  సైతం అదే  వస్త్రధారణ కొనసాగించేవాడినని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో భాగంగా 15 నూతన తెలుగు ఖతుల (పాంట్స్) ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  గీతం అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు  కూచిబొట్ల ఆనంద్,  సమాచార సాంకేతిక శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru condolence to yerram nadiu
Milk dairy chairman challa srinivasa rao kidnapped  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles