Crime report for sunday

Crime Report for Sunday.png

Posted: 10/28/2012 12:14 PM IST
Crime report for sunday

మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరిగిన వివిధ చోట్ల పలు రకాలు హత్యలు జరిగాయి. వాటన్నింటిని కలిసి సండే క్రైం స్టోరీస్ కింద మీకు అందిస్తున్నాం. వాటి వివరాలు. కడప జిల్లాలోని దువ్వూరు మండంలోని పుల్లారెడ్డి పేట బైపార్ రోడ్డు వద్ద ఆ జిల్లాకు చెందిన మాలమహానాడు నేత, జిల్లా కన్వీనర్ అయిన అయిన సాగర్ ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కేపు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సాగర్ పై ఎవరు ఎందుకు దాడి చేసి హత్య చేశారనిది మాత్రం ఖచ్చితంగా తెలియదని, పాత కక్ష్యలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలం కాజుపేటలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. హతుడిని నాసిర్ గా గ్రామస్తులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

హైదరాబాద్ లోని మేడ్చల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరీశీలించి, హత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో అనుమానం ఉన్న వ్యక్తుల దగ్గర నుండి ఆధారాలు సేకరిస్తున్నారు.

హైదరాబాద్ లోని పాతబస్తీలోని ఉప్పుగూడ ప్రాంతంలో ఉన్న మహాంకాళి అమ్మవారి ఆలయంలో రాత్రి చోరీ జరిగింది. ఈ చోరీలో దుండగలు భారీ సొమ్మును దోచుకెళ్ళారు. 5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, అమ్మవారి ముక్కుబుడక, పుస్తెలు, నాగపడగ, హుండీని దొంగిలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి, దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో లారీ - కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో ఐదురుగు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరు కూడా భవానీ మాల ధరించిన భక్తులు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రాంతంలో చిన్నారి సాన్వి, నాయనమ్మ సత్యవతిలను యండమూరి రఘునందన్ అనే యువకుడు డబ్బు కోసం హత్యలు చేసిన విషయం తెలిసిందే. హత్యకు గురైన సత్యవతి మృతదేహంను ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలోని స్వగ్రామం కుడుములకుంట్లకు తరలించారు. ఈమె అంత్యక్రియలు ఈ రోజు జరుగుతాయని ఆమె బంధువులు తెలిపారు. సత్యవతి మృతదేహం అక్కడికి రావడంతో అక్కడి ప్రాంతం శోక సముద్రంలో మునిగింది. రఘనందన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Central cabinet expansion
Chiru to get tourismkotla railway  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles